బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పరిశీలిస్తే ఇండియాలోని ఇద్దరు అత్యంత ధనవంతులు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల పేర్ల మధ్యలో మెక్సికన్ బిలియనీర్ కార్లోస్ స్లిమ్ పేరు ఇప్పుడు వినిపిస్తుంది. కార్లోస్ స్లిమ్ లాటిన్ అమెరికాలో అతిపెద్ద వ్యాపారవేత్త. అతని మొత్తం సంపద విలువ 85.4 బిలియన్ డాలర్లు. ప్రపంచ సంపన్నుల లిస్టులో అంబానీ తరువాత, అదానీ కంటే ముందు 18వ స్థానంలో ఉన్నాడు. లాటిన్ అమెరికా అతిపెద్ద మొబైల్ ఫోన్ ఆపరేటర్ అయిన అమెరికా మోవిల్‌లో కార్లోస్ స్లిమ్ కి వాటా ఉంది. గతేడాది ఈ కంపెనీ ఆదాయం 46 బిలియన్ డాలర్లు. అయితే ఎవరు ఈ కార్లోస్ స్లిమ్, అతనికి అంత సంపద ఎలా వచ్చింది అంటే...
కార్లోస్ స్లిమ్ హెలు 1940లో మెక్సికో నగరంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు లెబనాన్ నుండి వచ్చి మెక్సికోలో స్థిరపడ్డారు. అతను 1961లో నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పొందాడు. 25 సంవత్సరాల వయస్సులో అతను తన స్వంత కంస్ట్రక్షన్ కంపెనీ ఇన్‌మోబిలియారియా కార్సోను ప్రారంభించాడు తరువాత 1980లో మెక్సికో పొగాకు, రాగి ఇంకా మైనింగ్‌లో భారీగా పెట్టుబడి పెట్టాడు. ఇంకా 1990లలో రెస్టారెంట్ & రిటైల్ చైన్ శాన్‌బోర్న్ హెర్మనోస్‌ను కూడా కొన్నాడు. అదే సమయంలో అతను ప్రభుత్వ టెలికాం కంపెనీ టెల్మెక్స్ అండ్ వైర్ & ఫైబర్-ఆప్టిక్ కేబుల్ తయారీ కంపెనీ గ్రూపో కండ్యూమెక్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాడు.

సక్సెస్ ఎలా సాధించారు?
ఒక దశాబ్దం తర్వాత అతను అమెరికన్ మోవిల్ బ్యానర్ క్రింద లాటిన్ అమెరికా అంతటా మొబైల్ ఫోన్ ఆపరేషన్స్ సొంతం చేసుకున్నాడు. 2011లో దానిని టెల్మెక్స్‌లో విలీనం చేశారు. కార్లోస్ స్లిమ్‌కు చాల వాణిజ్య బ్యాంకులు, ఇంధన సంస్థలలో కూడా వాటా ఉంది. అతని కుటుంబ పెట్టుబడి సంస్థ గ్రూపో కార్సో ద్వారా, అతను మెక్సికో కంస్ట్రక్షన్ పరిశ్రమలో కూడా పెట్టుబడి పెట్టాడు. స్లిమ్ సంపదలో ఎక్కువ భాగం పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీల నుండి వస్తుంది. 2008 సంవత్సరంలో అతను న్యూయార్క్ టైమ్స్‌లో 6.4 శాతం వాటాను కూడా కొనుగోలు చేశాడు. స్లిమ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్నతనం నుండి తాను వ్యవస్థాపకుడిగా మారాలని ఇంకా తన తండ్రికి సహాయం చేయాలని కోరుకున్నాను. చిన్నవయసులోనే తండ్రి దగ్గర వ్యాపార కళ నేర్చుకున్నాడు. అతని తండ్రి అతనికి ఫైనాన్స్, మేనేజ్‌మెంట్ అండ్ అకౌంటింగ్ గురించి నేర్పించారు. అతను 11 సంవత్సరాల వయస్సులో ప్రభుత్వ సేవింగ్స్ బాండ్లలో పెట్టుబడి పెట్టినప్పుడు చక్రవడ్డీ గురించి మొదట తెలుసుకున్నాడు. 12 సంవత్సరాల వయస్సులో అతను మెక్సికన్ బ్యాంకులో తన మొదటి షేర్లను కొనుగోలు చేశాడు. అతని 13 సంవత్సరాల వయస్సులో అతని తండ్రి మరణించాక తండ్రి వ్యాపార బాధ్యతలు అతని భుజాలపై పడ్డాయి. సివిల్ ఇంజినీరింగ్‌తో పాటు ఆర్థిక శాస్త్రాన్ని కూడా చదివి వ్యాపారంలోని చిక్కులను అర్థం చేసుకున్నాడు.
అక్కడికక్కడే నలుగురు
అతను తన తండ్రి వ్యాపారాన్ని స్వాధీనం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. 25 సంవత్సరాల వయస్సులో అతను 3 మిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని అందుకున్నాడు. మెక్సికోలో రుణ సంక్షోభం, చమురు కొరత వారికి పెద్ద అవకాశంగా మారింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చాలా తక్కువ ధరలకు పలు కంపెనీలను కొనుగోలు చేశాడు. లాభాలు వచ్చిన తర్వాత ఈ కంపెనీలను అమ్మేశాడు. ఇదే తన విజయ రహస్యమని స్లిమ్ భావిస్తున్నాడు.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..



Click it and Unblock the Notifications