ఒక్క చిన్న ఆలోచన.. పీకల్లోతు అప్పుల నుంచి రూ. 3 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది.

భారతదేశంలో ఒక స్టార్టప్ ప్రారంభించడం అంటే ఒక కల, ఒక ఆతృత, ఒక ఆశ. కానీ ఆ కలను నెరవేర్చే ప్రయాణం మాత్రం అంత సులభం కాదు. కేవలం ఒక ఆలోచన సరిపోదు.. ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు, పన్ను దాఖలు, లైసెన్సులు, పత్రాలు..ఇక్కడ ప్రారంభమవుతుంది అసలు పోరాటం. మన దేశంలో చాలా మంది యువ వ్యవస్థాపకులు తమ కలలను నెరవేర్చే ముందు ఈ కాగితాల పోరాటంలోనే అలసిపోతారు. అలాంటి వారిలో ఒకరు బెంగళూరుకు చెందిన శరత్ శ్యాంసుందర్. అయితే తేడా ఒక్కటే ఆయన ఆ ఆటంకాలకు కుంగిపోలేదు. వాటిని అవకాశం గా మలిచుకుని జీవితంలో విజయం సాధించారు.

2011లో తన మొదటి స్టార్టప్ The Invitation Store ప్రారంభించినప్పుడు..ఆయన కూడా వేలాది ఫౌండర్లలానే నమ్మకంతో, అనేక కలలతో ముందుకు వచ్చాడు. కానీ మొదటి అడుగులోనే అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిన అనుభవం ఎదురైంది. అవసరం లేకపోయినా Service Tax Registration తీయమని ఆయనకు సలహా ఇచ్చారు. అవగాహన లేకుండా ఆయన ఆ సలహా పాటించాడు. ఫలితం. అపార డబ్బు నష్టం, సమయం వృథా, తీవ్ర నిరాశ. ఇంత చిన్న పని కోసం ఇన్ని బాధలా? అనే ప్రశ్న ఆయనను చిత్రవధ చేసింది.

Bangalore entrepreneur success story startup compliance business India 3 3 crore startup success Indian startup success story bootstrapped startup India home based business India business growth case study India compliance tech startup India startup legal compliance services SME SME compliance solutions India Indian entrepreneur inspiration small business success story India

చాలా మంది ఈ దశలోనే తమ కలలను వదులుకుని నిరాశలో కూరుకుపోతారు. అయితే శరత్ తన పట్టుదలను వదల్లేదు. తన మొదటి వ్యాపారాన్ని మూసివేయాల్సి వచ్చినా, ఆ వైఫల్యమే ఆయనను ముందుకు నడిపించింది. ఇంత చిన్న విషయంలో నేను ఇంతగా ఇబ్బంది పడ్డాను అంటే.. వేలాది మంది స్టార్టప్‌లు ఇంకా ఎంతగా బాధపడుతున్నారోనని ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ ఆలోచన ఒక మిషన్‌గా మారింది.

తరువాతి నాలుగేళ్లు ఆయన VakilSearch, PayU లాంటి కంపెనీలలో పని చేస్తూ, legals, tax filings, digital automation వంటి విషయాలను దగ్గరగా నేర్చుకున్నాడు. ప్రతి రోజు ఒక కొత్త పాఠం నేర్చుకున్నాడు. వ్యవస్థాపకులు తమ వ్యాపారాలను పెంచుకోవడానికి కాకుండా, కాగితాల కోసం, రిజిస్ట్రేషన్ల కోసం, ప్రభుత్వ కార్యాలయాల కోసం తిరగాల్సి వస్తోంది. వారి కలలను రక్షించడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదా? అన్న బాధ అతన్ని సక్సెస్ వైపు వెళ్లేలా చేసింది.

ఆ బాధ, ఆ కోపం, ఆ కల నుంచి కొత్త స్టార్టప్ మొదలైంది. 2015లో, కేవలం 2-3 లక్షల రూపాయలతో ఇంట్లోని ఒక చిన్న టేబుల్ నుండి శరత్ తన రెండో వ్యాపారం The Startup Zone జన్మించింది. రెండు హ్యాండ్ ల్యాప్‌టాప్‌లు, ఒక చిన్న బృందం, ఒక పెద్ద కల.. స్టార్టప్‌లను రక్షించడం.ఇదే అతనిని ముందుకు నడిపించింది.

ప్రారంభంలో VAT, Service Tax వంటి చిన్న సేవలతో మొదలైన ఈ ప్రయాణం త్వరగా వేగం పట్టింది. ప్రతి నెల ఒక కొత్త సేవ, ప్రతి సంవత్సరం ఒక కొత్త ముందడుగు పడింది. Company Incorporation, Accounting, IP, Funding Support ఇలా అన్నీ ఒకే చోటకు చేర్చి వ్యాపారాన్ని పరుగులు పెట్టించారు.

2017లో GST అమలు భారత్‌లో కలకలం రేపినప్పుడు.. ప్రభుత్వం పోర్టల్ ను ప్రారంభించక ముందే శరత్ బృందం సిద్ధంగా ఉంది. మొదటి రోజు వచ్చిన 100 కాల్స్ వారికి ఒక విజయాన్ని రుచి చూపించాయి. భారతదేశానికి వారి అవసరం చాలా ఉంది. ఆ రోజు మొదటి సారి శరత్ కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి. ఇదే నా దారి. ఇది కేవలం బిజినెస్ కాదు. ఇది ఒక సేవ అని అప్పుడే అనుకున్నారు.

మొదటి ఏడాది రూ. 5 లక్షల ఆదాయం, GST తరువాత రూ. 45 లక్షలు. COVID లాంటి అత్యంత కఠిన కాలంలో కూడా ఏ ఉద్యోగిని తొలగించలేదు, జీతాలు తగ్గలేదు. 2022 నాటికి రూ.1 కోటి, 2024-25లో రూ. 2.2 కోట్లు ఆదాయం, ఇప్పుడు లక్ష్యం రూ. 3 కోట్లు. అది కూడా ఒక్క రూపాయి బయట నుంచి పెట్టుబడి లేకుండా నడుపుతున్నాడు. ఈరోజు వరకు 5 వేలకు పైగా స్టార్టప్‌లకు సేవలు అందించాడు. వారిది ప్రచారం కాదు.. నోటి మాటే వారి మార్కెటింగ్. అదే వారిని విజయం వైపు నడిపించింది.

ఈరోజు The Startup Zone ఒక కొత్త అధ్యాయానికి సిద్ధంగా ఉంది. Business Beyond Boundaries (BBB) అంటే విదేశీ వ్యాపారాలను భారతదేశంలో ఏర్పాటు చేయడానికి ఒక కొత్త మార్గం కోసం చూపస్తున్నారు. Coworking spaces, HR firms, పెద్ద బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నారు. Automation & AI మీద భారీ పెట్టుబడి పెడుతున్నారు. దటీజ్ శరత్ శ్యామ్ సుందర్.

శరత్ ఇచ్చే సలహా ఏంటంటే.. Founders paperwork కోసం పోరాడాల్సిన అవసరం లేదు. వారి పోరాటం వారి కల కోసం ఉండాలని. ఇలాంటి కథలు విన్నప్పుడు విఫలం అవ్వడం ఓటమి కాదు..ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడమే నిజమైన ఓటమి అని..

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+