Myhome Rameswarrao: జూబల్లి రామేశ్వర్ రావు 1955లో ఆంధ్రప్రదేశ్‌లో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో అనేక కష్టాలు, భారాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో చదువు ఆపకుండా కిలోమీటర్లు కొద్ది నడిచి వెళ్లి చదువు కొనసాగించారు.
పాఠశాల విద్యను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత.. రామేశ్వర్ హోమియోపతి అభ్యసించడానికి చిన్న గ్రామం నుంచి 1974లో హైదరాబాద్ మహానగరానికి చేరుకున్నారు. అలా కళాశాల విద్య పూర్తిచేసి దిల్‌సుక్‌నగర్ లో క్లినిక్ ప్రారంభించారు. అనుకున్నట్లుగానే తన వైద్యశాల వృద్ధి చెందుతున్నప్పటికీ.. వ్యాపాంలో అడుగుపెట్టాలని, జీవితంలో మరింత ముందుకు సాగాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో తన వైద్యశాలకు వచ్చే రియల్ ఎస్టేట్ ఏజెంట్ల నుంచి ఆ పరిశ్రమ గురించి అడిగి తెలుసుకున్నారు. అలా రియల్టీ రంగంలో ఆసక్తితో ముందడుగు వేశారు.

రామేశ్వర్ రియల్ ఎస్టేట్‌లోకి ప్రవేశించిన కొత్తలో కొన్ని ఖాళీ స్థలాలను అమ్మి డబ్బు సంపాదించేవారు. ఆ తర్వాత హయత్ నగర్‌లో సుమారు రూ.50,000 వెచ్చించి ఒక స్థలాన్ని కొని ఓపెన్ ల్యాండ్ గా విక్రయించారు. భారీ లాభం రావటంతో తాను చేస్తున్న పనిపై నమ్మకం మరింతగా పెరిగింది. రామేశ్వర్ 1980లలో హైదరాబాద్‌లో MY HOME GROUPని స్థాపించారు. అలా 1985లో అపార్ట్‌మెంట్లు నిర్మించి విక్రయించే అవకాశం లభించింది. అప్పటి నుంచి ఆయన రియల్ ఎస్టేట్ ప్రయాణం ప్రారంభమై జీవితం పెద్ద మలుపు తిరిగింది.
ఆ తర్వాత మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ విభాగంగా మహా సిమెంట్‌ను స్థాపించారు. ఆ కాలంలో భారతదేశంలో నిర్మాణ రంగం వేగంగా వృద్ధిని సాధించింది. దీన్ని క్యాష్ చేసుకోవాలని నిర్ణయించుకుని మహా సిమెంట్‌లో 50% వాటాను ఐరిష్ కంపెనీ సీఆర్‌హెచ్ పీఎల్‌సీకి రూ.1,429 కోట్లకు విక్రయించాడు. శ్రీ జయజ్యోతి సిమెంట్స్ కంపెనీని ఈపీసీ నుంచి రూ.1,400 కోట్లకు కొనుగోలు చేశారు. చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకుని హోమియోపతి డాక్టర్‌గా రియల్ ఎస్టేట్‌లో అడుగుపెట్టి నేడు ఏడాదికి రూ.100 కోట్లు టర్నోవర్‌తో సిమెంట్ వ్యాపారవేత్తగా పేరుగాంచారు. ప్రస్తుతం మీడియా రంగంలో(TV9, 10TV) సైతం వ్యాపారాలను కలిగి ఉన్నారు. నేడు ఆయన నికర విలువ దాదాపు రూ.11,000 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications