Subramanian Swamy on Modi: సుబ్రహ్మణ్యస్వామి భారతీయ రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్. ఉన్నది ఉన్నట్లుగా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటంలో ఆయనకు మించిన వ్యక్తి ఉండబోరు. బీజేపీలోనే ఉంటూ పార్టీ నిర్ణయాలను ఎండకట్టడంలో ఆయనకు మించిన వ్యక్తి లేరు. క్యాబినెట్ మినిష్టర్ సహా ప్లానింగ్ కమిషన్ మెంబర్ గా కూడా ఆయన పనిచేసిన ఘనత కలిగి ఉన్న సంగతి తెలిసిందే.
ఇటీవలి కాలంలో ఆయన ఒక యూట్యూబ్ పాడ్కాస్ట్ సమయంలో బీజేపీ ప్రభుత్వంపై చేసిన కొన్ని కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ప్రధాని మోదీకి ఎకానమీ గురించి ఏమీ తెలియదని ఇప్పటికే పలుమార్లు సుబ్రహ్మణ్యస్వామి వివిధ సందర్భాల్లో వెల్లడించారు. 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది, రూపురేఖలు ఎలా మారతాయని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఇక్కడ ప్రస్తుతం ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కొనసాగినట్లయితే పరిస్థితులు చాలా దారుణంగా మారనున్నాయని స్వామి బదులిచ్చారు. 1930 కాలంలో అమెరికా ఉన్న స్థాయికి దిగజారుతుందని తేల్చి చెప్పేశారు. భారత ఆర్థిక వ్యవస్థ డిప్రెషన్ లోకి జారుకుంటుందని, అది ఎవ్వరూ ఊహించనంత దారుణంగా ఉండనుందని పేర్కొన్నారు. ప్రజల జీవితాలు రోడ్డున పడతాయని స్పష్టంగా వెల్లడించారు.

అయితే ప్రధాని మోదీ సర్కార్ తీసుకున్న ఏఏ కారణాలు ఇంత దారుణ పరిస్థితులకు దారితీస్తాయో వివరించాలని అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. ఆదాపుపన్ను రేట్లు, నిరంతరం పెంచుతున్న వడ్డీ రేట్లు ప్రమాదరకమైనవిగా పేర్కొన్నారు. ఇవి ప్రజలను డబ్బు ఖర్చు చేయటాన్ని డిస్కరేజ్ చేస్తాయని స్వామి పేర్కొన్నారు. అలాగే మోదీ సర్కార్ డిమాండ్ గురించి పట్టించుకోకుండా సప్లై భాగంపై దృష్టిపెట్టడాన్ని తప్పుపట్టారు. దీనివల్ల షోరూమ్లలో అధిక సంఖ్యలో ఉత్పత్తి చేసిన కార్లతో నిండిపోగా వాటిని కొనుగోలు చేసే వారు ఉండరని అన్నారు. గడచిన కొన్ని నెలల కార్ సేల్స్ వివరాలను పరిశీలిస్తే.. స్వామి చెప్పిన విషయాలు దేశంలో ఇప్పటికే జరుగుతున్నట్లు అర్థమవుతుంది. అమ్ముడుపోని కార్లు డీలర్ల వద్ద, కంపెనీ గోదాముల్లో పేరుకుపోయినట్లు ఆటో కంపెనీల గణాంకాలు వెల్లడించాయి.
దీనికి తోడు గడచిన కొన్ని నెలలుగా పరిస్థితులను పరిశీలిస్తే జీడీపీ వృద్ధి సైతం భారీగా క్షీణతను చూసిన సంగతి తెలిసిందే. కొందరు నిపుణులు ఈ పరిస్థితులను చూసి భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కొంత మెరుగుపడగా, నగర ప్రాంతాల్లో ఆందోళనకర స్థాయిలకు చేరుకున్న ద్రవ్యోల్బణం ప్రజలను భయపెడుతోంది. వస్తున్న వేతనం పెరిగిన ఖర్చులు తినేయటంతో ముఖ్యమైన అవసరాలకు మాత్రమే ఖర్చుచేస్తున్నారు. గృహోపకరణాలు వంటి ఇతర పెద్ద టిక్కెట్ ఖర్చులకు చాలా దూరంగా ఉంటున్నట్లు వెల్లడైంది. ఇలాంటి పరిస్థితుల్లో నగరాల్లోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని చూస్తున్నాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications