Subam Papers IPO: అక్టోబర్ నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఎంట్రీ ఇస్తున్న ఐపీవోలు పూర్తిగా ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేస్తున్నాయి. నిన్న మార్కెట్లోకి అరంగేట్రం చేసిన 2 ఐపీవోలు మిగిల్చిన చేదు నష్టాలను మరచిపోకముందే.. నేడు మరో షాక్ తగిలింది. మార్కెట్ల పతనం వేళ వస్తున్న ఐపీవోలు సైతం నిరాశను మిగులుస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లుగా ఐపీవోల నుంచి మంచి లాభాలను అందుకున్న ఇన్వెస్టర్లు, పరిస్థితులు తారుమారు కావటంపై గందరగోళానికి గురవుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సుబామ్ పేపర్స్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో నేడు మార్కెట్లలో ఇష్యూ ధర కంటే 7 శాతం తగ్గింపు రేటు రూ.142 చొప్పున అడుగుపెట్టాయి. దీంతో డిస్కౌంటెడ్ లిస్టింగ్ కారణంగా బెట్టింగ్ వేసిన చాలా మంది నష్టాలను చవిచూశారు. లిస్టింగ్ తర్వాత సైతం కంపెనీ షేర్ల పతనం కొనసాగటంతో 12 శాతం క్షీణతను ఐపీవో షేర్లు ఇంట్రాడేలో చూశాయి. దీని తర్వాత కంపెనీ షేర్లు బీఎస్ఈలో నేడు రూ.134.90 స్థాయికి దిగజారాయి. ఇది చూస్తుంటే మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ హెచ్చరిక తర్వాత మార్కెట్లు ఎస్ఎమ్ఈ ఐపీవోలతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

సుబామ్ పేపర్స్ లిమిటెడ్ కంపెనీ తన ఐపీవోను సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు సాధారణ పెట్టుబడిదారులు దరఖాస్తు చేసుకునేందుకు తెరచి ఉంచింది. ఈ క్రమంలో ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.114-152గా ప్రకటించింది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.93.70 కోట్లను సమీకరించింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్లోని ఇన్వెస్టర్లకు 61.65 తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. కంపెనీ రిటైల్ పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేసేందుకు లాట్ పరిమాణాన్ని 800 షేర్లుగా నిర్ణయించింది. దీంతో ఐపీవోపై బెట్టింగ్ వేసేందుకు ఇన్వెస్టర్లు లాట్ కొనుగోలుకు ఏకంగా రూ.1,21,600 వెచ్చించాల్సి వచ్చింది. ఈ క్రమంలో కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.26.70 కోట్లను సమీకరించింది.
తమిళనాడు కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న కంపెనీ 2006 అక్టోబరులో తన వ్యాపారాన్ని స్థాపించింది. కంపెనీ ప్రధానంగా క్రాఫ్ట్ పేపర్, పేపర్ ఉత్పత్తుల తయారీలో చురుకుగా ఉంది. కంపెనీ ప్రధానంగా వేస్ట్ పేపర్ తన ముడిసరకుగా వినియోగిస్తూ కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తోంది. కంపెనీ తన పోర్ట్‌ఫోలియోకు డ్యూప్లెక్స్ బోర్డ్, క్రాఫ్ట్ పేపర్‌లను జోడించడం ద్వారా దాని ఉత్పత్తిని విస్తరించింది. కంపెనీ ఉత్పత్తులు ఆటోమొబైల్స్, టెక్స్‌టైల్స్, FMCG, ఫుడ్, డిస్టిలరీస్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ప్రింటింగ్ వంటి వివిధ పరిశ్రమలలో ప్యాకేజింగ్ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. కంపెనీ 2024లో రూ.496.97 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇదే సంవత్సరం కంపెనీ లాభం రూ.33.42 కోట్లుగా ఉందని వెల్లడైంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications