Stylam Industries: దేశీయ పెట్టుబడిదారులు ఇటీవలి ర్యాలీ తర్వాత షేర్లలో పతనం కొనసాగుతున్న వేళ చాలా మంది చూపులు మాత్రం మల్టీబ్యాగర్ స్టాక్స్ పైనే ఉంది. తళుక్కున మెరిసేందుకు సిద్ధంగా ఉన్న మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్ కోసం చాలా మంది వెతుకున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్టైలమ్ ఇండస్టీస్ కంపెనీ షేర్ల గురించే. గడచిన కొన్నేళ్లుగా అధిక రాబడులు అందిస్తున్న కంపెనీల జాబితాలో స్టైలమ్ ఇండస్ట్రీస్ కూడా ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే. గత 10 ఏళ్లలో కంపెనీ షేర్ ధర ఏకంగా 14,000 శాతం పెరిగింది. శుక్రవారం కంపెనీ షేరు ధర 1.41 శాతం లాభంతో రూ.1,536.85 వద్ద ట్రేడింగ్ ముగించింది. ఎవరైనా ఇన్వెస్టర్ 10 ఏళ్ల కిందట స్టైలమ్ ఇండస్ట్రీస్ షేర్లలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే దాని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1.40 కోట్లకు చేరుకుని ఉండేది.

అయితే.. కంపెనీకి చెందిన పొజిషన్ ఇన్వెస్టర్లు ఈ ఏడాది భారీ నష్టాలను చవిచూశారు. ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం గత నెలలో స్టైలామ్ ఇండస్ట్రీస్ షేరు ధర 2.6 శాతం పడిపోయింది. గడచిన కొన్ని వారాలుగా అంతర్జాతీయ పరిస్థితులతో గ్లోబల్ మార్కెట్లు బలహీనమైన పనితీరుతో పాటు ఫెడ్ నిర్ణయం కోసం ఎదురుచూపులు వంటి కారణాలతో స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగిన సమయంలో స్టైలమ్ ఇండస్ట్రీస్ కంపెనీ కూడా కొంత ప్రభావితమైంది. ఇదిలా ఉండగా ఏడాది కాలానికి షేర్ల పనితీరును గమనిస్తే షేర్లు 51.6 శాతం పెరిగి ఊహించని రాబడిని అందించాయి.
కంపెనీ షేర్ హోల్డింగ్ పరిశీలిస్తే.. ప్రమోటర్ల వాటా మొత్తం 54.61 శాతంగా కొనసాగుతోంది. కాగా కంపెనీలో రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 45.39 శాతం వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్ పబ్లిక్‌లో 4 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇదే సమయంలో కంపెనీలో విదేశీ పెట్టుబడిదారులకు 3.35 శాతం వాటా ఉంది.


Click it and Unblock the Notifications