Multibagger Stock: గడచిన మూడేళ్లుగా దేశీయ స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ షేర్ ఇన్వెస్టర్లకు లాభాలను కురిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో 597 శాతం రాబడులను అందించి మల్టీబ్యాగర్ గా మారింది.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది స్టైలమ్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్ల గురించే. ఇది మూడేళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. కొంత సమయం వెచ్చిస్తే ఇలాంటి మల్టీబ్యాగర్ కంపెనీలను ఇన్వెస్టర్లు మార్కెట్లో సులువుగా గుర్తించవచ్చు. మధ్యస్థ కాలంలోనే కంపెనీ తన ఇన్వెస్టర్లకు బలమైన రాబడులను అందించి ఆశ్చర్యానికి గురిచేసింది.

Stylam Industries షేర్ ధర 10 ఆగస్టు 2020న రూ.225గా ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో కంపెనీ స్టాక్ ధర రూ.1,613.15 వద్ద ఉంది. ఈరోజు ఇంట్రాడేలో స్టాక్ 2.40 శాతం మేర లాభపడింది. ఎవరైనా ఇన్వెస్టర్ మూడేళ్ల కిందట స్టైలమ్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం వారి పెట్టుబడి విలువ రూ.7.16 లక్షలకు చేరుకుని ఉండేది.
ప్రస్తుతం స్టైలమ్ ఇండస్ట్రీస్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,730 కోట్లుగా ఉంది. ఏడాది కాలంలో స్టాక్ 38.53 శాతం రాబడిని అందించింది. అలాగే 2023లో ఇప్పటి వరకు 41.42 శాతం రిటర్న్ ఇచ్చింది. తాజాగా విడుదలైన జూన్ త్రైమాసిక ఫలితాల ప్రకారం కంపెనీ రూ.41.8 కోట్ల నికర లాభాన్ని నివేదించింది.

కంపెనీ లామినేట్, హై ప్రెజర్ లామినేట్స్, హై పెర్ఫార్మెన్స్ లామినేట్స్ (HPL), స్పెషాలిటీ లామినేట్స్, స్పెషాలిటీ సర్ఫేస్‌లు, యాక్రిలిక్ సాలిడ్ సర్ఫేస్‌లు, కాంపాక్ట్ లామినేట్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications