ఒక మంచి భవిష్యత్తు కోసం... పిల్లల చదువుకోసం... ఎంత శ్రమించడానికైనా సిద్ధపడతారు! ఇదే ప్రతి మధ్యతరగతి తల్లిదండ్రుల కల. కానీ ఇప్పుడు ఆ కల, ఒక్క సీటు సాధించేందుకు లక్షల రూపాయలు చెల్లించాల్సిన ఆర్థిక ఒత్తిడిగా మారుతోంది. తెలంగాణలో ఇంజనీరింగ్ చదువు అంటే ఒకప్పుడు గర్వంగా చెప్పుకునే విషయమైతే, ఇప్పుడు చాలా కుటుంబాలకి అది ఆర్థిక ఒత్తిడిగా, అప్పుల బారిన పడే ప్రమాదంగా మారిపోయింది.
ప్రతి ఏడాది పెరుగుతున్న ఫీజులు, డొనేషన్లు, అదనపు చార్జీలు ఇవన్నీ కలిసి తల్లిదండ్రుల కలల మీదే పడుతున్నాయి. విద్యార్థులు భవిష్యత్తు కోసం పోరాడుతుంటే... తల్లిదండ్రులు ఫీజుల కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది.

తెలంగాణలో ఇంజనీరింగ్ చదువు ఇప్పుడు చాలా కుటుంబాలకి ఆర్థికంగా పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, (AI), (ML) లాంటి డిమాండ్ ఉన్న కోర్సులపై ఆసక్తి పెరగడంతో, ప్రైవేట్ కాలేజీలు ప్రతి సంవత్సరం 20-30% వరకూ ఫీజులు పెంచుతున్నాయి. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు ఈ విద్య ఒక భారీ ఖర్చుగా మారిపోతోంది.
CBIT, VNR విజ్ఞాన జ్యోతి, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, MGIT, నారాయణ లాంటి ప్రముఖ ప్రైవేట్ కాలేజీలు కంప్యూటర్ సైన్స్ కోర్సులకు ఏడాదికి సుమారు రూ. 1.65 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. దాంతో పోలిస్తే, ఉస్మానియా విశ్వవిద్యాలయం, JNTUH లాంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో మొత్తం నాలుగేళ్ల B.Tech కోర్సు ఫీజు రూ. 1.5 - రూ. 3 లక్షల మధ్యలోనే ఉంటుంది. అయినా కూడా, ప్రభుత్వ కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు, ఫ్యాకల్టీ కొరతల వల్ల చాలామంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలను ఎంచుకుంటున్నారు.
ఈ ఏడాది స్థిరమైన ఫీజు నిర్మాణం లేకపోవడం వల్ల తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొంది. ఒక తల్లి చెబుతూ "నా కూతురు TGEAPCET ద్వారా మంచి ప్రైవేట్ కాలేజీలో సీటు సంపాదించింది. కానీ అధికారికంగా చెప్పిన రూ. 1.5 లక్షల ఫీజుతో పాటు, అనేక ఇతర చార్జీలు కూడా వసూలు చేశారు. మొత్తంగా మొదటి ఏడాదిలోనే దాదాపు రూ.15 లక్షలు ఖర్చు అయింది" అన్నారు.
మరొక తండ్రి సాయి రాజ్ మాట్లాడుతూ "నాకు గత ఏడాది ట్యూషన్ ఫీజుతో పాటు మేనేజ్‌మెంట్ కోటాలో డొనేషన్ కూడా అడిగారు. ఇప్పుడు కాలేజీలు AI, ML, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త కోర్సులు జోడించి వాటి పేరుతో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు.
ఒక ప్రైవేట్ కాలేజీ ప్రొఫెసర్ మాట్లాడుతూ "గత 5 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. నిజంగా కాలేజీల ఖర్చులు పెరుగుతున్నాయంటే, ఆ డబ్బు ఎక్కడ వెళ్తోందో చూపాలి క్లాస్‌రూములు, సిబ్బంది జీతాలు, ల్యాబ్‌ల పై ఖర్చు చేస్తున్నారా లేదా? లేకపోతే ఇవన్నీ కేవలం తప్పు పేర్లతో పెంచిన ఫీజులే అవుతాయి" అని అన్నారు.
ఎన్ రమేష్ బాబు (ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్) మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సిలబస్ ఇంకా పాతదే అని చెప్పారు. "ఉదాహరణకు సివిల్ ఇంజినీరింగ్‌లో సాఫ్ట్‌వేర్ ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్‌లో కీలకం. కానీ ఇక్కడ ఏ విశ్వవిద్యాలయం కూడా అది బోధించడం లేదు. విద్యార్థులు పాత మెటీరియల్ నేర్చుకుని జాబ్స్ మిస్సవుతున్నారు. అందుకే అందరూ కంప్యూటర్ సైన్స్ వైపు మళ్లుతున్నారు" అన్నారు. ఇంకా, ప్రభుత్వ కాలేజీల్లో ల్యాబ్ పరికరాలు కూడా పాతవే. ప్రభుత్వం ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల ఈ సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
TGEAPCET 2025 డేటా ప్రకారం, తెలంగాణలో ఇంజనీరింగ్ కోర్సులలో కంప్యూటర్ సైన్స్ మరియు సంబంధిత బ్రాంచ్‌లకు 65,080 సీట్లు ఉండగా, వాటిలో 59,219 సీట్లు ఇప్పటికే భర్తీ అయ్యాయి. అయితే, సివిల్, మెకానికల్ వంటి ఇతర బ్రాంచ్‌లలో సీట్ల భర్తీ రేటు కేవలం సుమారు 50% మాత్రమే ఉంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలలో సుమారు 70% సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తాయి, మిగతా సీట్లు మేనేజ్‌మెంట్ కోటా (కేటగిరీ B) కింద ఉంటాయి, ఇవి సుమారు 23,000 సీట్లు. అదనంగా, SC, ST, BC, EWS కేటగిరీలకు రిజర్వేషన్లు, అలాగే మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ కూడా లభిస్తుంది. ఈ ఏడాది మొత్తం కన్వీనర్ కోటా సీట్లు 90,246 ఉండగా, వాటిలో 76,793 సీట్లు భర్తీ అయ్యి, 13,453 సీట్లు ఖాళీగా మిగిలాయి.
మాజీ IAS అధికారి జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ "ఫీజుల పెంపు పై కేవలం కమిటీలు ఏర్పాటు చేయడం సరిపోదు. అలా చేస్తే కాలేజీలు లంచాలు ఇచ్చి తాము కోరుకున్న ఫీజు నిర్మాణం ఆమోదించించుకుంటాయి. అంతకంటే పోటీని పెంచాలి, అన్ని కాలేజీల్లో కనీస ప్రమాణాలు పెంచాలి" అన్నారు.
అలాగే, ప్రభుత్వం ప్రారంభించిన ఫీ రీయింబర్స్‌మెంట్ పథకం ఆలస్యాల వల్ల బలహీనమైందని, దాంతో కొన్ని మంచి కాలేజీలు ప్రీమియం ఫీజులు వసూలు చేస్తుండగా, ఇతర చోట్ల సీట్లు ఖాళీగా మిగులుతున్నాయి అని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 363 ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు మరియు కేవలం 25 ప్రభుత్వ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఎక్కువ మంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల పైనే ఆధారపడుతున్నారు. తెలంగాణ అడ్మిషన్ మరియు ఫీజు నియంత్రణ కమిటీ (TAFRC)ను ప్రైవేట్ అన్‌ఏడెడ్ సంస్థల ఫీజులను నిర్ణయించే అధికారం ఇచ్చారు.
వి బాలకిష్ట రెడ్డి నేతృత్వంలో 10 మంది నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి, కాలేజీల ఫీజు నిర్మాణం, ర్యాంకింగ్స్, బోధన నాణ్యత, ఇంటర్నల్ అసెస్‌మెంట్ సిస్టమ్స్ లాంటి అంశాలపై సమీక్ష చేస్తున్నారు. ఇటీవల 160 కాలేజీలతో పబ్లిక్ హియరింగ్స్ కూడా నిర్వహించారు.
మొత్తానికి, తెలంగాణలో ఇంజినీరింగ్ చదువును చదివే విద్యార్థులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఫీజులపై ఎలాంటి నియంత్రణలూ లేకపోవడం, ప్రభుత్వ కాలేజీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఫ్యాకల్టీ కొరత, పాత సిలబస్ వినియోగంలో ఉండటం, అలాగే ప్రైవేట్ కాలేజీలలో భారీ ఫీజులు వసూలు చేయడం ఇలా ఇవి కలిసి ఇంజినీరింగ్ చదువును విద్యార్థుల మరియు తల్లిదండ్రుల కోసం ఆర్థికంగా భారంగా మార్చిపెట్టాయి.
నిపుణులు చెబుతున్నట్టు ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రభుత్వం అన్ని కాలేజీలలో కనీస నాణ్యత ప్రమాణాలను పెంచి, పోటీని సమతుల్యం చేయడం తప్పనిసరి. లేదంటే, కొద్దిమంది కాలేజీలు మాత్రమే ప్రీమియం ఫీజులు వసూలు చేస్తూ, మిగతా కాలేజీలు ఖాళీ సీట్లతో ఇబ్బంది పడే పరిస్థితి కొనసాగుతుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications