లండన్: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు విద్యార్థులు భారీ షాకిచ్చారు. అమెజాన్ చేసిన చిన్న పొరపాటు వల్ల విద్యార్థులు పెద్ద ఎత్తున ఆర్డర్లు పెట్టి, చుక్కలు చూపించారు. ఆ పొరపాటు దిగ్గజ కంపెనీకి కోట్లాది రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టగా, ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసిన విద్యార్థులకు వరంగా మారింది. అమెజాన్ ప్రైమ్ స్టూడెంట్ డీల్ పేరుతో మొదటిసారి కొనుగోలు చేసిన విద్యార్థులు Welcome5 అనే కూపన్ కోడ్‌ను ఎంటర్ చేస్తే వారికి 5 పౌండ్లు (మన రూపాయల్లో రూ.450కి పైగా) విలువైన డిస్కౌంట్ లభిస్తుంది. అంతే విలువున్న వస్తువునే కొనుగోలు చేస్తే ఖర్చు చేయకుండా ఉచితంగా పొందవచ్చు.

చిన్న లొసుగుతో విద్యార్థుల కొనుగోళ్లు..
5 పౌండ్లు ఉచితం కలిగిన ఈ కూపన్ కోడ్ ఒకేసారి పని చేస్తుంది. ఈ మేరకు అమెజాన్ ప్రకటన కూడా చేసింది. దీంతో విద్యార్థులు ఆ కూపన్ కోడ్‌తో ఒకసారి ట్రాన్సాక్షన్ చేశారు. అయితే డిస్కౌంట్ కూపన్ కోడ్‌ను మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చుననే లొసుగు కనుగొన్న అనంతరం విద్యార్థులు కొనుగోలు కోసం ఎగబడ్డారు. ఎవరో కొందరు సరదాగా మళ్లీ వస్తుందో చూద్దామని అంటే రెండోసారి ప్రయత్నిస్తే కూపన్ కోడ్ సక్సెస్ అయింది.

టూత్ పేస్ట్ వంటివి కూడా కొనుగోలు చేశారు..
ఈ లొసుగును గుర్తించిన విద్యార్థులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపారు. అంతేకాదు, ఇది ఒక్కరొక్కరికి అలా అందరికీ తెలిసిపోయింది. వారు ఎన్నిసార్లు కూపన్ కోడ్ ఇచ్చినా మళ్లీ మళ్లీ తీసుకుంటుందని గుర్తించారు. ఇది యూకేలోని క్యాంపస్‌లలో అందరు విద్యార్థులకు తెలిసిపోయింది. మంచి ఆఫర్ ఉండటంతో విద్యార్థులు టాయిలెట్ రోల్స్, టూత్‌పేస్ట్ వంటివి కూడా కొనుగోలు చేశారు.

ఏమీ చెల్లించకుండా రూ.2.30 లక్షల విలువ గల వస్తువులు
విద్యార్థులు ఒకే అకౌంట్ నుంచి పదులు, వందల సంఖ్యలో ఆర్డర్లు ఇచ్చారు. ఒక విద్యార్థి ఏకంగా 2,500 పౌండ్ల విలువ కలిగిన (మన రూపాయల్లో దాదాపు రూ.2.30 లక్షలు) వస్తువులు కొనుగోలు చేశాడు. కానీ ఏమీ చెల్లించలేదు. చాలామంది విద్యార్థులు తమ డిగ్రీ కోర్సు పూర్తయ్యే వరకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేశారు. ఇంకొంతమంది ఇంటికి పంపించారు. విద్యార్థులు అదేపనిగా ఆర్డర్లు పెట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్డర్లు, డెలివరీలు జరిగాయి.

వేర్ హౌస్‍లుగా మారిపోయిన విద్యార్థుల ప్లాట్లు
లండన్, డుర్హామ్, నాటింగ్‌హామ్, మాంచెస్టర్, సాల్ఫోర్డ్, హార్డ్‌ఫోర్డిషైర్ నగరాల్లోని విద్యార్థుల ఫ్లాంట్లు వేర్ హౌస్ (గోడౌన్లు)ను తలపించాయంటే అర్థం చేసుకోవచ్చు. ఓ దశలో టాప్ సెల్లింగ్ లిస్టులో టూత్ బ్రష్, టూత్ పేస్ట్ కూడా ఉన్నాయి. అంటే ఆర్డర్లు ఎంతలా పెట్టారో తెలుసుకోవచ్చు. డియోడెరంట్స్, బుక్స్, బ్యాటరీలు, ఐఫోన్ ఛార్జర్లు, స్పోర్ట్స్ సాక్స్, చీప్ బీర్ వంటివి ఇలా అన్నీ కొనుగోలు చేశారు.

తొలుత కనుగొన్నది న్యూకాస్టిల్ ఫ్లాట్‌లో ఉండే విద్యార్థి
న్యూకాస్టిల్‌లోని ఓ ఫ్లాట్‌లో ఉండే ఓ విద్యార్థి ఈ లొసుగును మొదట గుర్తించాడు. ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకున్నాడు. Welcome5 కోడ్ ఒకసారి ఉపయోగించుకోవచ్చునని ఆఫర్‌లో పేర్కొన్నారని, కానీ ఇది రెండోసారి కూడా పని చేసిందని ఓ విద్యార్థి చెప్పారు.

ఆఫర్ కోడ్ మళ్లీ మళ్లీ
ఈ విషయం తెలియగానే కార్చిచ్చులా వెంట వెంటనే అందరు విద్యార్థులకు తెలిసిపోయింది. ఈ ఆఫర్ కోడ్ మళ్లీ మళ్లీ పని చేయడాన్ని చూసి ఆశ్చర్యపోయామని ఓ విద్యార్థి చెబుతున్నారు. బీరు సీసాల ప్యాక్‌ను 6.99 పౌండ్లకే అందులో పొందగలిగామని, అంటే చాలా తక్కువకు వచ్చిందని మరో విద్యార్థి చెప్పాడు. అమెజాన్ ఆ ఆఫర్‌లోని పొరపాటును గుర్తించి ఏ క్షణంలో అయినా వెనక్కి తీసుకుంటుందని భావించి తాము ఉదయం 3 గంటల నుంచి ఆర్డర్లు వరుసగా పెట్టామని మరో విద్యార్థి చెప్పాడు.

పొరపాటు సరిదిద్దుకున్న అమెజాన్
అమెజాన్ ఈ పొరపాటును వారం పది రోజుల తర్వాత కానీ గుర్తించలేదు. అక్టోబర్ 15వ తేదీ నుంచి గత గురువారం వరకు ఈ ఆఫర్ ద్వారా కొన్ని లక్షల ఆర్డర్లను విద్యార్థులు ఉచితంగా పొందారు. పొరపాటును ఆలస్యంగా గుర్తించిన అమెజాన్ ఆ తర్వాత పొరపాటును సరిదిద్దుకుంది. కానీ అప్పటికే తీవ్ర నష్టం జరిగింది. రూ.కోట్లు నష్టపోయింది. అమెజాన్ పొరపాటుపై విద్యార్థులు రకరకాలుగా స్పందిస్తున్నారు. అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలకు ఇదేమంత పెద్ద నష్టం కాదని, పైగా ఇలా జరగడం వల్ల కంపెనీ పేరు మారుమోగుతుందంటున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications