Study Abroad: విదేశీ డిగ్రీ పొందడం అంటే కేవలం విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడం మాత్రమే కాదు. దీనికోసం పాస్‌పోర్ట్, వీసా పొందడం నుంచి అవరసరమైన నగదు ఏర్పాట్లు, సాధ్యమైతే స్కాలర్‌షిప్‌లు పొందడం వరకు అనేక అంశాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఖరీదైన విదేశీ విద్య కోసం ప్లాన్ చేసేటప్పుడు ముందుగానే అందుకోసం అవసరమైన ప్రతిదీ ప్లాన్ చేసుకోవాలి.
చదువుకునేందుకు వెళ్లిన దేశం కరెన్సీ కంటే విద్యార్థి సొంత దేశ కరెన్సీ విలువ తక్కువగా ఉన్నట్లయితే.. చాలా ఎక్కువ ఖర్చవుతుంది. ముఖ్యంగా వసతి, భోజనం వంటి ప్రాథమిక జీవన వ్యయాలను కలుపుకుంటే ఖర్చు అధికమవుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటికి తోడు రవాణా, ల్యాప్‌టాప్, ఇంటర్నెట్, ఫోన్, అంతర్జాతీయ కాలింగ్, ప్రభుత్వ IDలు, లైబ్రరీ మెంబర్ ఫిప్స్, వృత్తిపరమైన అనుబంధాలు, నివసించే ప్రదేశాలకు అనుగుణంగా దుస్తులు, వాహనాలు, స్నేహితులతో సరదాగా చేసే ఖర్చులు లాంటివీ ఉంటాయి.

ఉదాహరణకు CFA చేయాలనుకునే ఫైనాన్స్ విద్యార్థులు కొన్ని సంవత్సరాల్లో అస్థిరమైన పరీక్షలు, పుస్తకాల కోసం దాదాపు 4000 డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. కెరీర్ కాన్ఫరెన్స్ రిజిస్ట్రేషన్, హోటల్, ప్రయాణం మొదలైన వాటి కోసం సులభంగా 1500-2000 డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. విద్యార్థులు సంవత్సరానికి ఒకసారి స్వదేశానికి తిరిగి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్లయితే దాని వల్ల మరో 2000 డాలర్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి.. భారీ ప్రీ-బడ్జెట్ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఇన్వెస్ట్ మెంట్లు చేయటం ప్రారంభించాలి. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థి స్కాలర్‌షిప్‌ల కోసం ప్రయత్నించాలి.
కాబట్టి విద్యార్థులు తమ విద్యకు అయ్యే పూర్తి ఖర్చును పరిగణనలోకి తీసుకోవాలి. కేవలం ట్యూషన్, అద్దె, భోజనం ఖర్చుల కోసం మాత్రమే కాకుండా.. గ్రాడ్యుయేషన్‌కు చేరుకోవడానికి ఎంత ఖర్చవుతుందో లెక్కించుకోవాలి. కానీ మరోవైపు స్కాలర్‌షిప్‌లు, గ్రాడ్యుయేట్ స్టూడెంట్ స్టైపెండ్‌లు, పార్ట్‌టైమ్ ఉపాధితో సహా అందుబాటులో ఉన్న అన్ని ఫైనాన్స్ వనరులను పరిగణలోకి తీసుకోవాలి. ఈ ఖర్చులను చూసి విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు. కానీ.. వెళ్లేముందు మెరుగ్గా ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు, ఫైనాన్సియల్ ప్లానింగ్ కోసం విద్యార్థులకు ఉపకరిస్తుందని నిపుణులు అంటున్నారు.


Click it and Unblock the Notifications