స్టూడెంట్ వీసాలపై అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులకు అమెరికన్ ఎంబసీ వార్నింగ్ తో కూడిన హెచ్చరిక జారీ చేసింది. అమెరికా వీసా అనేది ఎవరికైనా స్వయంగా లభించే హక్కు కాదని, అది పూర్తిగా ఒక ప్రత్యేక గౌరవం మాత్రమేనని స్పష్టం చేసింది. Student visa పొందిన విద్యార్థులు అమెరికా చట్టాలు, నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని, వాటిని ఉల్లంఘిస్తే ఎలాంటి సడలింపులు ఉండవని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది.
స్టూడెంట్ వీసాతో అమెరికాలో ఉన్న విద్యార్థులు స్థానిక చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంబసీ స్పష్టంగా పేర్కొంది. చట్టాల ఉల్లంఘన జరిగితే వీసాను తక్షణమే రద్దు చేయడం, విద్యార్థులను బలవంతంగా స్వదేశాలకు పంపించడం వంటి చర్యలు తీసుకుంటామని తెలిపింది. అంతేకాదు, కొంతకాలం పాటు అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేయకుండా బ్లాక్‌లిస్ట్‌లో ఉంచడం, తీవ్రమైన సందర్భాల్లో అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. భవిష్యత్తులో అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించే అవకాశమూ ఉందని తెలిపింది.

ఈ మేరకు అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారతీయ విద్యార్థులు మాత్రమే కాకుండా, అమెరికాలో ఉన్న అన్ని విదేశీయులు అక్కడి చట్టాలను గౌరవిస్తూ వ్యవహరించాలని ప్రకటనలో సూచించింది. విద్యా, ఉద్యోగం లేదా ఇతర కారణాలతో అమెరికా వెళ్లిన వారంతా తమ వీసా షరతులు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను పూర్తిగా తెలుసుకుని పాటించాల్సిన అవసరం ఉందని ఎంబసీ స్పష్టం చేసింది.
ఇటీవల కాలంలో అమెరికా స్టూడెంట్ వీసాల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తోంది. స్టూడెంట్ వీసాలకే కాకుండా వర్కింగ్ వీసాలు, టూరిస్ట్ వీసాలు, బిజినెస్ వీసాల మంజూరులో కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని విభాగాల్లో కొత్త వీసాల జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేస్తూ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మార్పులు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత వేగంగా అమలవుతున్నాయి.
వీసా నిబంధనలు పాటించని వారిని అమెరికా అధికారులు తక్షణమే బలవంతంగా స్వదేశాలకు పంపిస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. అక్రమంగా పనిచేయడం, వీసా గడువు దాటిపోవడం, అనుమతి లేని కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి కారణాలతో అనేక మంది విదేశీయులను అమెరికా నుంచి పంపివేసిన ఉదంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా ఎంబసీ తాజా హెచ్చరికను జారీ చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజా హెచ్చరిక భారతీయ విద్యార్థులకు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. వీసా షరతులు, చట్టపరమైన బాధ్యతలను నిర్లక్ష్యం చేయకుండా, పూర్తిగా అవగాహనతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికాలో విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులు కేవలం చదువుపై మాత్రమే కాకుండా, అక్కడి చట్టాలు, నిబంధనలపైనా సమానంగా దృష్టి పెట్టాలని ఈ హెచ్చరిక స్పష్టం చేస్తోంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications