Wagh Bakri: దేశంలో ప్రముఖ వ్యాపారి మరణానికి వీధి కుక్కలు కారణంగా మారటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ వార్త ఇంటర్నెట్ లో విభిన్న వాదనలకు కారణమోతోంది.
ఇటీవలి కాలంలో దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన టీ బ్రాండ్ వాఘ్ బక్రీ. దీని గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ మరణించారు. అయితే దీనికి కారణంగా వీధి కుక్కల దాడి కావటం అందరికీ బాధ కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. 49 ఏళ్ల పరాగ్ దేశాయ్ తన అహ్మదాబాద్ ఇంటి బయట వీధికుక్కలు వెంబడించటంతో కింద పడిపోయారు. ఈ క్రమంలో ఆయన మెదడులో రక్తస్రావం అయ్యింది. దీనికోసం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా వారం తర్వాత అక్టోబర్ 22న మరణించారు.

తాజాగా పరాగ్ దేశాయ్ మరణం మరోసారి వీధి కుక్కల దాడులు, ఈ వివాదాస్పద సమస్య చుట్టూ ఉన్న చట్టాలపై దృష్టి సారించేలా చేసింది. దీనిపై సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ ఎక్స్‌లో పెద్ద చర్చకు దారితీసింది. మారుతున్న నగర జీవనశైలి, నగరాల అభివృద్ధి మనుషులపై కుక్కల దాడులు పెరగటానికి కారణంగా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉదయం వాకింగ్ కి వెళ్లే వారు వీధి కుక్కల నుంచి రక్షణ కోసం కర్రను తీసుకెళ్లాలని సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ట్వీట్ చేశారు. ఒక వేళ మీ ప్రాంతాలో జంతు ప్రేమికులు ఉన్నట్లయితే పెద్ద కర్రను తీసుకెళ్లాలని ట్వీట్ చేయటంపై కొందరు మద్దతు ఇవ్వగా మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతదేశంలోని రోడ్లు, వీధులు జాగింగ్, మార్నింగ్ వాక్ వంటి వాటికి సురక్షితమైనవి కాదంటూ ప్రాజెక్ట్‌ఫిట్‌కో వ్యవస్థాపకుడు చిరాగ్ బర్జాత్యా ట్వీట్ చేశారు. కుక్కలు ఆకలితో ఉన్నప్పుడు లేదా బెదిరింపులకు గురైనప్పుడు దూకుడుగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమేనని బలరాం విశ్వకర్మ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. అయితే జంతు ప్రేమికులు మాత్రం ఇది దురదృష్టకరమైన సంఘటన అని కుక్కల సంతతి విషయంలో స్థానిక అధికారులు తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications