Layoffs: మరో రౌండ్ లేఆఫ్స్ ప్రకటించిన స్ట్రీమింగ్ దిగ్గజం.. ఏకంగా 17 శాతం ఉద్యోగులకు ఉద్వాసన
IT News: అసలే ఉద్యోగాల కొరతతో సతమతమవుతున్న యువతపై లే ఆఫ్స్ తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గతేడాది మొదలైన ధోరణి నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. లక్షలాది ఉద్యోగులు కొలువులు కోల్పోగా.. ఒకేసారి కాకుండా వివిధ దశల్లో సిబ్బందికి ఉద్వాసన పలుకేందుకు కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీ స్పాటిఫై మరోసారి కఠినంగా నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది మొదటి 6 నెలల్లోనే దాదాపు 800 మందిని తొలగించిన spotify.. మరో 1500 మందికి ఇప్పుడు లేఆఫ్స్ ప్రకటించింది. ఏకంగా 17 శాతం మంది ఉద్యోగులను తీసివేయనున్నట్లు సిబ్బందికి రాసిన లేఖలో CEO డానియల్ EK స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధి మందగమనం, మూలధన భారం కారణంగా ఉద్వాసన పలకడం తప్పడం లేదని చెప్పుకొచ్చారు. సవాళ్లను ఎదుర్కొంటూ, భవిష్యత్ లక్ష్యాలను చేరుకునేందుకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

సంస్థలోని పలువురు తెలివైన, కష్టపడే, ప్రతిభావంతులపై దీని ప్రభావం ఉంటుందన్నారు. మరో రెండేళ్ల పాటు చిన్న మొత్తాల్లో ఉద్యోగులపై వేటు పడుతూనే ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఓవైపు ఖర్చులు తగ్గించుకుంటూ, వాటిని తిరిగి పెట్టుబడి పెట్టి.. తమ లక్ష్యాలు సాధించుకోవాలని చూస్తున్నట్లు వెల్లడించారు. ఈ తరహా పునర్వ్యవస్థీకరణ కంపెనీ విజయవకాశాలను మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆర్థిక అనిశ్చితి పేరిట పలు అగ్రశ్రేణి కంపెనీలు ఇప్పటికే మరో రౌండ్ ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమయ్యాయి. దాదాపు 670 మందిని తొలగించాలని చూస్తున్నట్లు లింక్డ్ ఇన్ అక్టోబర్లో ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ జనవరిలో ప్రకటించిన వాటి కంటే ఎక్కువ మంది ఉద్యోగులపైనే వేటు వేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. బ్రాడ్కామ్ కూడా దాదాపు 1,300 మంది VM వేర్ సిబ్బందిని ఇంటికి పంపుతున్నట్లు గతవారం రిపోర్ట్ బయటకొచ్చాయి.


Click it and Unblock the Notifications