పశ్చిమాసియలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మూడవ వారంలోకి ప్రవేశించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హార్ముజ్ జలసంధిపై దృష్టి సారించారు. ఇది పెర్షియన్ గల్ఫ్ నుండి ఓమన్ గల్ఫ్‌కు దాదాపు ఐదవ వంతు ప్రపంచ చమురు రవాణా జరిగే అత్యంత కీలకమైన మార్గంగా ఉంది. ఇరాన్ దీనిని దిగ్బంధం చేసే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ కొత్త వ్యూహాత్మక నిర్ణయం తీసుకుని.. ఈ జలసంధి ద్వారా వెళ్లే నౌకలను రక్షించడానికి బహుళ దేశాలతో కూటమి ఏర్పాటు చేయనున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు.
ట్రంప్ సర్కారు ఈ వారం ప్రారంభంలోనే కొత్త కూటమి ప్రకటించాలని భావిస్తోంది. ఆయన శత్రుత్వాలు మొదలయ్యే ముందు లేదా తరువాత యుద్ధనౌకల కార్యకలాపాలను ప్రారంభించవచ్చని చెప్పారు. ఆదివారం ట్రంప్ మాట్లాడుతూ.. హార్ముజ్ జలసంధి తెరిచి ఉంచడానికి ఏడు దేశాలను యుద్ధనౌకలను పంపమని కోరాడు. కానీ ఆ దేశాల నుండి తక్షణ ధృవీకరణ రాలేదు. చైనాను దృష్టిలో ఉంచుకుని ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే 90 శాతం చమురు చైనా ఈ మార్గం ద్వారా పొందుతుందని ఆయన ఆరోపణ.. ఈ నేపథ్యంలో చైనా కూటమిలో చేరుతుందో లేదో స్పష్టంగా చెప్పలేదు.

UK విదేశాంగ మంత్రులు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) సభ్యులు ప్రకటించిన ప్రకటనలో.. తమ భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి, భూభాగాలు, పౌరులు, నివాసితులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కు కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధి కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఇరాన్ దీన్ని ఒపెన్‌గా ఉంచకపోవడం వల్ల, ముడి చమురు ధరలు గ్లోబల్ మార్కెట్లలో రికార్డు స్థాయికి చేరాయి. ట్రంప్ దేశాలను మద్దతు ఇవ్వమని పిలుపునిచ్చి, చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, UK వంటి ప్రధాన దేశాలను హార్ముజ్‌లో నౌకలు పంపమని కోరారు.
ఇరాన్ వెనక్కి తగ్గకుండా మద్దతు చూపుతూ.. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు మాత్రమే జలసంధిని మూసివేయడమే నిజం అని వాదించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మాట్లాడుతూ.. ఇది అమెరికన్, ఇజ్రాయెల్ నౌకలకు మాత్రమే మూసివేయబడింది.ఇతర దేశాల నౌకలు సురక్షితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ప్రస్తుత ఉద్రిక్తతల మధ్య, హార్ముజ్ జలసంధి మార్గంలో సురక్షిత రవాణా కోసం అమెరికా, ఇజ్రాయెల్,ఇతర దేశాల జట్టు కట్టే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ట్రంప్ కూటమి ప్రకటన ద్వారా.. ఈ ప్రాంతంలో చమురు సరఫరా నిలకడగా ఉండేందుకు, ప్రపంచ దేశాల మద్దతు పొందే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications