IT Raids: ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్టవ్ క్రాఫ్ట్ కంపెనీ ప్రాంగణాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించటంలో విషయం బయటకు పొక్కింది.
తాము పూర్తిగా అధికారులకు సహకరిస్తున్నామని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ప్రస్తుతం దేశంలో కుక్కింగ్ అప్లయెన్సెస్ తయారీలో ప్రఖ్యాత కంపెనీగా కొనసాగుతోంది. కంపెనీ అధికారులు ఆదాయపు పన్ను శాఖ అధికారులతో సహకరిస్తున్నారు మరియు వారు లేవనెత్తిన ప్రశ్నలకు స్పందిస్తున్నట్లు తన ఫైలింగ్స్ లో స్పష్టం చేసింది.

అయితే దాడులు ముగిసిన తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించిన సమచారాన్ని వెల్లడిస్తామని తెలిపింది. కంపెనీ తమకు వర్తించే అన్ని చట్టాలకు కట్టుబడి ఉందని.. "ఉత్తమ" కార్పొరేట్ గవర్నెన్స్ పద్ధతులను అనుసరిస్తున్నట్లు వెల్లడించింది. పన్ను అధికారుల సోదాలకు సంబంధించిన వార్త బయటకు రావటంలో స్టాక్ భారీగా నష్టపోయింది. ఇంట్రాడేల్ అత్యధికంగా 5.3 శాతానికి పైగా పతనాన్ని నమోదు చేసింది. సాయంత్రం 3.20 గంటల సమయంలో కంపెనీ షేర్ ధర ఎన్ఎస్ఈలో 3.23 శాతం నష్టంతో రూ.501 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

కంపెనీ వ్యాపారాన్ని పరిశీలిస్తే పీజియన్ పేరుతో వంట సామాగ్రిని విక్రయిస్తోంది. అలాగే గిల్మా పేరుతో కిచెన్ సెటప్ సొల్యూషన్స్, పీజియన్ ఎల్ఈడీ పేరుతో లైటింగ్ సొల్యూషన్స్, బ్లాక్ డెక్కర్ పేరుతో జూసర్లు, మిక్సర్లు, ఓవెన్లు, ఫుడ్ స్టీమర్ వంటి ఇతర ఉత్పత్తులను విక్రయిస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications