రేపు(అక్టోబర్ 5, సోమవారం) జీఎస్టీ కౌన్సిల్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వాలకు ఆదాయాలు తగ్గాయి. ఇప్పటికే జీఎస్టీ పెండింగ్ నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ సమావేశం వాడిగా, వేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వంతో విభేదిస్తున్నాయి. 20 రాష్ట్రాల్లో బీజేపీ, మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి.
కరోనా వైరస్ వల్ల ప్రభుత్వాలకు ఆదాయం తగ్గడంతో రూ.97వేల కోట్ల మేరకు రుణాలు తీసుకోవడానికి కేంద్రం ఇచ్చిన ఆప్షన్‌ను రాష్ట్రాలు అంగీకరించాయి. దీంతో 42వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ రేపు జరిగే అవకాశమున్నందున ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు రుణ అవకాశాలను తోసిపుచ్చి జీఎస్టీ పరిహారానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన ఆప్షన్‌కు అంగీకరించడం లేదు.

మహమ్మారి వల్ల ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే రాష్ట్రాలకు రూ.2.35 లక్షల జీఎస్టీ ఆదాయ లోటు ఏర్పడింది. వీటిలో రూ.97వేల కోట్లు జీఎస్టీ అమలుతో ఏర్పడ్డ లోటు ఉంది. అదికాకుండా మరో రూ.1.38 లక్షల కోట్లు కరోనా కారణంగా తగ్గింది. ప్రభుత్వం రూ.97వేల కోట్లను ఆర్బీఐ వద్ద రుణంగా తీసుకోమని రాష్ట్రాలకు చెప్పింది. లేదంటే రూ.2.35 లక్షల కోట్లను మార్కెట్ నుండి సేకరించమని వెల్లడించింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications