Storage Technologies IPO: నేడు మార్కెట్లు మెుత్తం మూడు ఐపీవోలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు పట్టిందల్లా బంగారంగా మారిపోయింది. ఈ మూడింటిలో షేర్లు పొందిన వారి సంపద క్షణాల్లో పెరిగి బంపర్ రాబడులను అందుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మార్కెట్ల అస్థిరతలో అడుగుపెట్టినప్పటికీ ప్రీమియం రేటుతో మార్కెట్లోకి బలమైన లిస్టింగ్ నమోదు చేసిన స్టోరేజీ టెక్నాలజీస్ అండ్ ఆటోమేషన్ ఐపీవో గురించే. కంపెనీ షేర్లు అలాట్మెంట్లో పొందిన ఇన్వెస్టర్లు లాభాల మత్తులో సంతోషంగా గడుపుతున్నారు. మార్కెట్లోకి 90 శాతం ప్రీమియం రేటుతో ఒక్కో షేరు రూ.148.20 వద్ద అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వాస్తవానికి కంపెనీ ఇష్యూ గరిష్ఠ ధర సబ్‌స్క్రిప్షన్ సమయంలో రూ.78గా ఉంది. రిటైల్ ఇన్వెస్టర్ల బెట్టింగ్ కోసం ఐపీవో ఏప్రిల్ 30న తెరుచుకుని మే 3న ముగిసింది.

బంపర్ లిస్టింగ్ నమోదు చేసిన ఐపీవో అరంగేట్రం తర్వాత నెలకొన్న కొనుగోళ్ల పోటీతో.. స్టోరేజ్ టెక్నాలజీస్ అండ్ ఆటోమేషన్ షేర్లు 5% ఎగువ సర్క్యూట్ తాకి రూ.155.59కి చేరుకున్నాయి. స్టోరేజ్ టెక్నాలజీస్ షేర్లు మొదటి రోజునే పెట్టుబడిదారుల డబ్బును రెట్టింపు చేశాయి. తాజా ఐపీవో నుంచి కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.29.95 కోట్లను విజయవంతంగా సమీకరించింది. బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో జాబితా అయిన కంపెనీ అక్టోబర్ 2010లో స్థాపించబడింది. ఈ కంపెనీ స్టోరేజ్ ర్యాకింగ్ సిస్టమ్స్ వ్యాపారంలో ఉంది. ఐపీవో పూర్తికి ముందు కంపెనీలో ప్రమోటర్ల వాటా 100 శాతంగా ఉండగా.. ప్రస్తుతం అది 70.09 శాతానికి తగ్గింది.
స్టోరేజ్ టెక్నాలజీస్ అండ్ ఆటోమేషన్ యొక్క IPO మొత్తం 278.82 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది . కంపెనీ IPOలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 242.74 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 577.02 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల(QIB) కోటా 117.86 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి కోసం లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా నిర్ణయించటంతో వారు పాల్గొనేందుకు కనీస మెుత్తంగా రూ.1,24,800 ఇన్వెస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications