కరోనా కారణంగా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు ఖాళీ అవుతున్నాయి. ఐటీ రంగానికి ఈ రెండు నగరాలు పెట్టింది పేరు. కరోనా వ్యాప్తిని నిరోధించే క్రమంలో సాఫ్టువేర్ సంస్థలు సహా వెసులుబాటు కలిగిన ప్రతి రంగం కూడా తమ ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసే వెసులుబాటును కల్పించింది. కంపెనీలు అన్నీ తాత్కాలికంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. కరోనా కారణంగా ఇది ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. అదే సమయంలో కొన్ని కంపెనీలు పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ దిశగా అడుగులు వేస్తున్నాయి.

స్టోరేజ్ హౌస్‌లకు యమ డిమాండ్
తాత్కాలికం లేదా పర్మినెంట్ ఏదయినా ఐటీ రంగం సహా వివిధ రంగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి. దీంతో ఐటీ అంటేనే మొదటగా గుర్తుకు వచ్చే బెంగళూరు నగరం ఖాళీ అవుతోంది. ప్రధానంగా టెక్కీలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. కరోనా తగ్గుతుందేమోనని అద్దె ఇళ్లలోనే ఉండి వేచి చూసిన వారు కూడా ఇప్పుడు ఎప్పటికి తగ్గుతుందో తెలియని పరిస్థితుల్లో ఖాళీ చేసి వెళ్తున్నారు. దీంతో బెంగళూరు నగరంలో స్టోరేజ్ హౌస్‌లకు డిమాండ్ పెరుగుతోంది.

డిమాండ్ ఎందుకు పెరుగుతోంది
సేఫ్ స్టోరేజ్, స్టోరేజియన్స్, స్టోనెస్ట్ స్టోరేజ్, ఆరెంజ్ సేఫ్ స్టోరేజ్, మై-రక్ష వంటి సంస్థల సేవలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. టెక్కీలు సహా చాలామంది ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఇళ్లను ఖాళీ చేస్తున్న వారు తమ వస్తువులను సేఫ్‌గా దాచుకునేందుకు ఈ సేవల వైపు మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా ఎక్కువ కాలం విదేశాలకు వెళ్లేవారు వీటిని ఉపయోగిస్తారు. అలాగే, ఇళ్లు ఖాళీ చేసి, సరైన ఇళ్లు దొరికే వరకు కూడా స్టోరేజ్ హోమ్స్ ఉపయోగించుకుంటారు. ఇప్పుడు కరోనా కారణంగా డిమాండ్ ఊహించని విధంగా పెరిగింది.

అద్దెలు చాలా ఎక్కువ అందుకే..
బెంగళూరు వంటి నగరాల్లో అద్దెకు ఉండాలంటే ఆరు నెలల నుండి ఏడాది వరకు అడ్వాన్స్ చెల్లించాలి. అంతేకాదు, అద్దెలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ కాలం నగరంలో ఉండలేని పరిస్థతుల్లో వీటికి ప్రత్యామ్నాయం స్టోరేజ్ హౌస్‌లు. కేవలం వ్యక్తులే కాదు, సంస్థలు కూడా కార్యాలయాలకు సంబంధించి తమ వస్తువులను దాచుకోవడానికి ఉపయోగిస్తాయి.

ఏవైనా సరే
ఇంట్లో ఉపయోగించే వస్తువులు, ఆఫీస్ ఐటమ్స్, డాక్యుమెంట్స్, వాహనాలు.. ఇలా దేనినేనా దాచుకోవడానికి ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రాతిపదికన వీటిని దాచుకోవచ్చు. పికప్ సదుపాయం కూడా ఉంది. వ్యక్తిగత లాకర్ సదుపాయం, 24 గంటలు సీసీటీవీ పర్యవేక్షణ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

రెంట్ భారం లేకుండా ఇవి కూడా...
ఈ స్టోరేజ్‌లు వివిధ రకాలుగా సేవలు అందిస్తున్నాయి. వీటిని ఉపయోగించే వారిలో స్టార్టప్స్, రెస్టారెంట్లు, జిమ్‌లు, చిన్న చిన్న ఐటీ కంపెనీలు, ప్లే స్కూల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. తమ నెలవారీ అద్దెల్ని తగ్గించుకోవడానికి ఈ సౌకర్యాన్ని తమకి అనుగుణంగా ఉపయోగించుకుంటాయి ఈ సంస్థలు. ప్రకృతి వైపరీత్యాలు, ఫైర్ యాక్సిడెంట్ వంటివి జరిగితే బీమా కూడా ఉంటుంది.

రెంట్ పెద్ద మొత్తంలో తగ్గింది
బెంగళూరు నుండి కన్నూరుకు షిఫ్ట్ అయిన రాజీవ్ ఎంపీ మాట్లాడుతూ.. మార్చి నెల నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ అయినప్పటికీ తాను తన 2BHK ఇంటికి నెలకు రూ.24,000 చెల్లిస్తున్నానని, దీంతో తాను ప్రత్యామ్నాయంగా స్టోరేజ్ హౌస్‌ను ఎంచుకున్నానని, తన ఇంటి వస్తువుల రవాణా కోసం రూ.5,500 తీసుకున్నారని, నెలకు రూ.2,891 తీసుకుంటున్నారని తెలిపారు.
సేఫ్ స్టోరేజ్ కో-ఫౌండర్ రమేష్ మాడిశెట్టి మాట్లాడుతూ.. తమకు 1.16 లక్షల స్క్వేర్ ఫీట్లతో 13 వేర్ హౌస్‌లు ఉన్నాయని, ఇప్పటికే కొత్తగా 27వేల స్క్వేర్ ఫీట్లతో కొత్తది తీసుకున్నామని, రానున్న రోజుల్లో మరింత డిమాండ్ పెరిగి, కొత్తవి తీసుకోవచ్చునని చెప్పారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!



Click it and Unblock the Notifications