అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం ఇవాళ భారత స్టాక్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది. టారిఫ్ ప్రకటించే వరకు లాభాల వైపు ముందుకు సాగిన మార్కెట్, రెండో రోజు క్షీణతతో ముగిసింది. ఏప్రిల్ 3న షేర్ మార్కెట్ రెడ్ మార్కులో ముగియగా , నేడు అంటే ఏప్రిల్ 4న భారీ ప్రకంపనలతో నష్టాల్లో కుప్పకూలింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ 930.67 పాయింట్లు తగ్గి 75,361.49 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 345.65 పాయింట్లు తగ్గి 22,904.45 వద్ద ముగిసింది.

నేడు స్టాక్ మార్కెట్లో కేవలం 1081 షేర్లు మాత్రమే లాభపడగా, ఏకంగా 2721 షేర్లు నష్టాల బాట పట్టాయి. 131 షేర్లలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. మదుపర్లు ఈక్విటీ హోల్డింగ్‌లను విక్రయించడంతో ఒక్కసారిగా 11 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. నిఫ్టీ 50 సూచికలో, ONGC, హిందాల్కో, సిప్లా వంటి దిగ్గజ కంపెనీలు వరుసగా ఆరు శాతానికి పైగా కుప్పకూలాయి. సుంకాల భయాలతో అమ్మకాలు ఊపందుకోవడంతో మార్కెట్ మరింత క్షీణించింది. ఆటో, ఫార్మా, ఐటీ, మెటల్ రంగాల సూచీలు భారీగా పడిపోవడంతో, అన్ని రంగాల సూచీలు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 , నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 మధ్యాహ్నం సెషన్‌లో మూడు శాతం వరకు పడిపోవడంతో చిన్న , మధ్య తరహా మార్కెట్లు కూడా తీవ్రంగా నష్టపోయాయి.
అమెరికా ప్రకటించిన కొత్త సుంకాల వల్ల భారతదేశంలోని చాల రంగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఈ భయాల కారణంగా, ఈరోజు ఫార్మా ఇండెక్స్ 4% కంటే పైగా క్షీణతతో ముగిసింది. ఇదే రోజున సిప్లా లిమిటెడ్ షేర్లు దాదాపు ఆరు శాతం తగ్గాయి. బయోకాన్ కూడా దాదాపు భారీ స్థాయిలో నష్టాలను చవిచూసింది. అదేవిధంగా డాక్టర్ రెడ్డీస్ కూడా ట్రేడింగ్ సమయంలో నష్టాల్లోనే ఉంది. అయితే, మ్యాన్‌కైండ్ ఫార్మా స్వల్ప లాభాల్లో కొనసాగింది. ఫార్మా లాగే నిఫ్టీ ఆటో, ఐటీ, మెటల్ సూచీలు కూడా ఒత్తిడిలో కొనసాగాయి.
రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయంటే : భారతదేశంపై విధించిన సుంకాలు చాల ఇతర దేశాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, అమెరికా ప్రతీకారం తీర్చుకుందని, ఈ ప్రభావం కొన్ని రంగాలపై కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ కారణంగానే షేర్ మార్కెట్ ఆందోళన ట్రేడవుతుండగా, పెట్టుబడిదారులు భయపడుతున్నారు. నిజానికి ఇప్పుడు కొత్త సుంకాల యుద్ధం భయం తలెత్తింది. యూరోపియన్ యూనియన్, చైనాతో సహా ఇతర దేశాలు అమెరికన్ ఉత్పత్తులపై తిరిగి సుంకాలను పెంచవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అనిశ్చితి కొంతకాలం ఉండవచ్చు.
ఈరోజు సెన్సెక్స్‌లో అతిపెద్ద పతనం టాటా స్టీల్ షేర్లలో కనిపించింది. టాప్ 30 కంపెనీలలో టాటా స్టీల్ షేర్లు 8.59 శాతం క్షీణతతో ముగిశాయి. షేర్ మార్కెట్ క్లోసింగ్ సమయానికి టాటా మోటార్స్ షేర్లు 6.15 శాతం క్షీణతతో ట్రేడవుతున్నాయి. LT, అదానీ పోర్ట్స్, NTPC , టెక్ మహీంద్రా వంటి పెద్ద కంపెనీల పరిస్థితి నేడు దారుణంగా ఉండగా, 30 కంపెనీలలో 24 షేర్లు క్షీణతతో ముగిశాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications