Worst Stocks: 2022లో చాలా కంపెనీలు తమ ఐపీవోలను మార్కెట్లోకి ఫ్లోట్ చేశాయి. అయితే వీటిలో టెక్ స్టార్టప్ కంపెనీలు మాత్రం నిరుత్సాహపరచటంతో పాటు ఇన్వెస్టర్లను నిండా ముంచాయి. ఇవి మార్కెట్లలో ఎన్నడూ చూడని రీతిలో ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేసి డిజాస్టర్లుగా నిలిచాయి.

పేటీఎం షేర్..
అత్యంత చెత్త పనితీరు కనబరిచిన షేర్లలో పేటీఎం కంపెనీ షేర్లు ముందు వరుసలో నిలిచాయి. అసలు ఆరంభంలోనే షేర్ ధర డిస్కౌంటెడ్ రేటుకు లిస్ట్ అయ్యింది. దీనికి తోడు యాంకర్ పోర్షన్ మిగిలిపోగా కంపెనీ దానిని రిటైల్ ఇన్వెస్టర్లకు అంటగట్టింది. తన కంపెనీ షేర్లతో చాలా మంది మిలియనీర్లు అవుతారని ఛైర్మన్ & CEO విజయ్ శేఖర్ శర్మ చెప్పిన మాటలు నిటిమూటలయ్యాయి. నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న కంపెనీ షేర్ 2022లో 65 శాతానికిపైగా క్షీణించి ప్రస్తుతం రూ.474.85 వద్ద ఉంది. ప్రస్తుతం మార్కెట్ క్యాప్ రూ.30 వేల కోట్లుగా ఉంది.

జొమాటో షేర్..
దేశంలోని ఫుడ్ డెలివరీ రంగంలో అగ్రగామిగా ఉన్న జొమాటో షేర్లు సైతం ఇన్వెస్టర్లను ఊరించి చివరికి నష్టాల్లోకి నెట్టాయి. కంపెనీ క్యాష్ బర్నింగ్ వ్యాపార మోడల్ కారణంగా పెరుగుతున్న నష్టాలు ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేశాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్ 2022లో 78 శాతానికి పైగా నష్టపోయి ప్రస్తుతం రూ.54.05 వద్ద ఉంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.44 వేల కోట్లకు పడిపోయింది. త్రైమాసికాలు మారుతున్నా కంపెనీ లాభాల్లోకి రాకపోవటం ఇన్వెస్టర్లు నమ్మకాన్ని కోల్పోవటానికి ఒక ప్రధాన కారణంగా నిలుస్తోంది.

నైకా షేర్..
నైకాను విజయవంతంగా మార్కెట్లోకి తీసుకురావటంతో ఫల్గుణి నాయర్ పేరు వార్తల్లో సంచలనంగా మారిపోయింది. మహిళా ధనవంతుల జాబితాలో ఆమె నిలిచింది. బ్యూటీ &కాస్మొటిక్ ఉత్పత్తుల ఈ-రిటైలర్ కంపెనీ తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఏజియో, టాటా ఐక్లిక్, మింత్రా వంటి కంపెనీలకు పోటీగా ఉంది. ఇటీవల కంపెనీ షేర్ స్పిట్ కూడా ప్రకటించింది. ఐపీవో 2022లో 58 శాతం క్షీణించింది. ప్రస్తుతం షేర్ ధర రూ.142.20 వద్ద ఉండగా.. కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపుగా రూ.41 వేల కోట్లుగా ఉంది.

జెన్సార్ టెక్నాలజీస్ షేర్..
దేశంలోని అగ్ర వ్యాపారవేత్తల్లో ఒకరుగా ఉన్న హర్ష్ గోయంకా కంపెనీ జెన్సార్ టెక్నాలజీస్. ఐటీ సేవల రంగంలో ఉన్న ఈ కంపెనీ ఇటీవల ఆ రంగం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల కారణంగా ఇన్వెస్టర్ల అంచనాలను అందుకోలేక పోయింది. పెరిగిన ఉద్యోగుల ఖర్చులు, తగ్గిన ప్రాజెక్టులు కంపెనీ ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో కంపెనీ షేర్ 2022లో 57 శాతం పతనమైంది. ప్రస్తుతం షేర్ ధర రూ.202.75 వద్ద ఉండగా.. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4 వేల కోట్లుగా ఉంది.

LIC షేర్..
ఇన్వెస్టర్ల నమ్మకాన్ని ఒమ్మెు చేసిన కంపెనీల్లో ఎల్ఐసీ షేర్ కూడా నిలిచింది. ఈ షేర్లలో ఎక్కువగా రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన ఐపీవో స్టాక్ ధర ఇప్పటి వరకు 24.51 శాతం క్షీణించింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఒక్కో షేర్ ధర రూ.660.70 వద్ద ఉంది. ప్రస్తుతం ఎల్ఐసీ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4.17 లక్షల కోట్లుగా ఉంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications