Focus Stocks: గడచిన వారం భారత స్టాక్ మార్కెట్లు చివరి రెండు రోజులు భారీగా నష్టపోయాయి. ఈ క్రమంలో రానున్న వారం సైతం దేశీయ మార్కెట్లలో ఒడిదొడుకులు కొనసాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో కొన్ని కంపెనీల షేర్లు ప్రధానంగా ఫోకస్ లో ఉండవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ముందుగా ప్రైవేటు బ్యాంకింగ్ రంగ కంపెనీ యెస్ బ్యాంక్ షేర్లు ఉన్నాయి. తాజాగా రూ.2,500 కోట్ల నిధులను సమీకరించేందుకు బోర్డు జూన్ 23న ఆమోదించటం దీనికి ప్రధాన కారణంగా ఉంది. నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు , బాండ్స్, మీడియం టర్మ్ నోట్ (MTN)తో సహా డెట్ సెక్యూరిటీల జారీ ద్వారా నిధులు సమీకరించనున్నట్లు వెల్లడించింది.

ఇదే క్రమంలో ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు సైతం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. బ్యాంకులో తన వాటాను పెంచుకోవడానికి హిందూజా గ్రూప్ కొత్తగా రూ.10,000 కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు అంగీకరించటం దీనికి వెనుక అసలు కారణం. ఇండస్‌ఇండ్ బ్యాంక్ హోల్డింగ్‌ను 26%కి పెంచాలని గ్రూప్ నుంచి వచ్చిన అభ్యర్థనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేయవచ్చని తెలుస్తోంది. ఇది సానుకూలమైన అంశం కాబట్టి ఇన్వెస్టర్లు పెట్టుబడి అవకాశాల కోసం ప్రయత్నించొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుత తరుణంలో ప్రాధాన్యం సంతరించుకున్న షేర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఫైటర్ జెట్ ఇంజిన్‌ల కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్, జీఈ ఏరోస్పేస్ మధ్య ఏంవోయూ కూడా జరిగింది. పీఎం మోదీ అమెరికా పర్యటనలో దీనికి సంబంధించిన సంతకాలు జరిగాయి. ఈ డీల్ కంపెనీ షేర్లను ప్రభావితం చేయనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదే క్రమంలో ఫోకస్‌లో ఉన్న మరో స్టాక్ ఏషియన్ పెయింట్స్. కంపెనీ అదనంగా వైట్ టేక్ ప్రమోటర్లకు చెందిన 11% ఈక్విటీ షేర్ క్యాపిటల్ రూ.54 కోట్లకు సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. వైట్ టేక్ లో ప్రస్తుతం ఏషియన్ పెయింట్స్ 60% ఈక్విటీ హోల్డ్ చేస్తున్నందున సబ్సిడరీగా మారిపోయింది.

మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ రూ.394.89 కోట్ల విలువైన ప్రాజెక్ట్ కోసం రైల్ వికాస్ నిగమ్(RVNL) అత్యల్ప బిడ్డర్(L1)గా ఎంపికైంది. మొదటి ఆర్డర్ ఛతర్‌పూర్ సర్కిల్‌లో కొత్త 11 KV లైన్‌లు, AB కేబుల్‌పై తక్కువ టెన్షన్ లైన్‌లు, టెస్టింగ్, కమీషనింగ్, ఇతర సేవలను అందించాల్సి ఉంది. ఆర్డర్ విలువ రూ.126.8 కోట్లుగా ఉంది. ఇదే తరహాలో రెండవ ఆర్డర్‌ను సియోని-నార్సింగ్‌పూర్ సర్కిల్‌లో నిర్వహించాల్సి ఉంది. దీని విలువ రూ.154.23 కోట్లని తెలుస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు RVNL షేర్లపై దృష్టి సారించవచ్చని తెలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications