Rupee Fall Effect: గత ఆరు రోజులుగా రూపాయి విలువ నిరంతరం పతనమవుతూనే ఉంది. మాంద్యం భయాల వల్ల డాలర్ నిరంతరం బలపడటంతో రూపాయి మారకపు విలువ దాదాపు రూ.80ని దాటడానికి దగ్గరగా ఉంది. US ఫెడరల్ రిజర్వ్ ఈ నెలాఖరులో పాలసీ రేటును మరోసారి పెంచవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో మాంద్యం భయంతో డాలర్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి కోసం డాలర్ వైపు మొగ్గు చూపటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రూపాయి విలువ క్షీణత లిస్టెడ్ కంపెనీలపై ప్రభావం చూపుతోంది. సింపుల్ గా చెప్పాలంటే.. ఎగుమతులు చేసే కంపెనీలకు రూపాయి క్షీణత ఒక పెద్ద శుభవార్త. ఇలా లాభపడటంతో పాటు నష్టపోయే స్టాక్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. మీ పెట్టుబడులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని లాభపడండి...

లాభపడే స్టాక్స్ ఇవే..
రూపాయి విలువ పతనం వల్ల ఐటీ రంగ కంపెనీల స్టాక్స్ లాభపడనున్నాయి. వీటిలో టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, మైండ్‌ట్రీ కంపెనీలు ఉన్నాయి. ఎందుకంటే వారి సంపాదనలో ఎక్కువ భాగం డాలర్ల రూపంలో విదేశాల నుంచి వస్తుంది. ఐటీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఇదో మంచి అవకాశమని అవెండస్ క్యాపిటల్ సీఈవో ఆండ్రూ హాలండ్ అన్నారు. ఈ స్టాక్‌లు ఇప్పుడు చౌకగా అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు భారీ రాబడులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

కంపెనీలకు సంపాదన ఇలా..
TCS సంపాదనలో 50 శాతం US నుంచే వస్తోంది. అదేవిధంగా.. ఇన్ఫోసిస్ ఆదాయంలో 60 శాతం ఉత్తర అమెరికా నుంచే వస్తోంది. HCL సంపాదనలో 55 శాతం వరకు US నుంచి మాత్రమే వస్తోంది. అయితే.. మార్జిన్లపై ప్రభావం వల్ల ఐటీ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. అలాగే.. యూరప్‌లో మాంద్యం భయాలు కూడా ఈ స్టాక్‌లను ప్రభావితం చేశాయి. రూపాయి పతనంతో ఐటీ స్టాక్స్‌తో పాటు దివీస్ లేబొరేటరీస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్ వంటి ఎగుమతి ఆధారిత కంపెనీలు కూడా లాభపడతాయి. గత నెల రోజుల్లో దివీస్ ల్యాబ్ షేర్లు 4.5 శాతం, బాలకృష్ణ ఇండస్ట్రీస్ 6.3 శాతం చొప్పున లాభపడ్డాయి.

ఈ షేర్లు నష్టాలను చవిచూడవచ్చు..!
మరోవైపు.. రూపాయి పతనంతో దిగుమతి చేసుకునే కంపెనీల షేర్లు ప్రభావితం కావచ్చని తెలుస్తోంది. వీటిలో విదేశాల నుంచి ముడిసరుకు దిగుమతి చేసుకునే కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో పెయింట్ తయారీదారులైన ఏషియన్ పెయింట్స్, బెర్గర్ పెయింట్స్ ఉన్నాయి. రూపాయి విలువ పతనం ఈ కంపెనీల దిగుమతి బిల్లును పెంచుతోంది. దీంతో పాటు టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పిడిలైట్ ఇండస్ట్రీస్, ఆస్ట్రల్, సుప్రీమ్ ఇండస్ట్రీస్ వంటి బడా కంపెనీలు కూడా రూపాయి పతనంతో నష్టపోనున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications