బంగారం, స్టాక్స్ లేదా డెట్? రూ. 2.7 లక్షల కోట్ల ఫండ్ మేనేజర్ సంచలన ఇన్వెస్ట్‌మెంట్ ఫార్ములా!
పెట్టుబడి పెట్టడానికి బంగారం బెస్ట్ ఆప్షనా? లేక Stock market లో డబ్బులు పెట్టాలా? లేదంటే డెట్ (Debt) ఫండ్స్ సేఫా? ఈ ప్రశ్న ప్రతి ఇన్వెస్టర్ మైండ్‌లోనూ తిరుగుతూ ఉంటుంది. అయితే, గతంలో ఎవ్వరూ ఊహించని విధంగా బంగారం, వెండి ధరల రేసింగ్‌ను ముందే కరెక్ట్‌గా అంచనా వేసిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ (ICICI Prudential AMC) ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (CIO) మనీష్ బంతియా.. ఇప్పుడు ఇన్వెస్టర్లకు ఒక షాకింగ్ అలర్ట్ ఇచ్చారు. దాదాపు రూ. 2.7 లక్షల కోట్ల అసెట్స్ మేనేజ్ చేసే ఆయన.. ప్రస్తుత తరుణంలో బంగారంపై కొత్తగా ఒక్క రూపాయి కూడా పెట్టవద్దని తెగేసి చెప్తున్నారు.

ఆ రోజు హిట్టయ్యారు.. ఈరోజు ఏం చెప్తున్నారు?
నవంబర్ 2023లో బంగారంపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేనప్పుడు, ధరలు పదేళ్లుగా ఒకేలా ఉన్నప్పుడు.. మనీష్ బంతియా బంగారం కొనమని చెప్పారు. కట్ చేస్తే, ఆ తర్వాత గోల్డ్ రేట్లు ఎక్కడికో వెళ్ళిపోయాయి. అలాగే డిసెంబర్ 2025 చివరిలో వెండి ధరలు పీక్‌కు చేరాయని, ఇక తగ్గుతాయని చెప్పారు.. అదీ నిజమైంది.
కానీ ఇప్పుడు ఆయన మాట మార్చారు. "ప్రస్తుతం ఉన్న వాల్యుయేషన్స్ చూస్తుంటే, బంగారంపై అదనపు పెట్టుబడులు పెట్టడం ఏమాత్రం సేఫ్ కాదు. ఈరోజు మనకున్న మూడు ఆప్షన్స్ (ఈక్విటీ/స్టాక్ మార్కెట్, డెట్, గోల్డ్) లలో బంగారం అస్సలు ఆకర్షణీయంగా లేదు" అని స్పష్టం చేశారు. అందుకే గత ఆరు నెలలుగా ఆయన గోల్డ్‌లో పెట్టుబడులను బాగా తగ్గించేశారు (Underweight).
సీన్ ఎలా రివర్స్ అయింది?
2023లో పరిస్థితి వేరు. అప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని విపరీతంగా కొన్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం, డీ-డాలరైజేషన్ భయాల వల్ల బంగారం రేట్లు పెరిగాయి. కానీ 2024, 2025 నాటికి కథ మొత్తం మారిపోయింది. ధరలు విపరీతంగా పెరగడంతో సెంటిమెంట్ ఓవర్ పాజిటివ్‌గా మారిపోయింది.
భారత్‌లో అయితే వెండి ఈటీఎఫ్‌ల (Silver ETFs) లో విపరీతంగా ఇన్వెస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన వెండి డిమాండ్‌లో ఇండియా వాటాయే 5 శాతంగా ఉందంటే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల మార్కెట్లో కొనుగోలుదారులు ఎక్కువైపోయి రేట్లు అనవసరంగా పెరిగాయని బంతియా విశ్లేషించారు.
ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ ఏడాది జనవరి 29న బంగారం ధరలు ఆల్-టైమ్ హై అయిన $5,626.80 మార్కును తాకి, అక్కడి నుండి దాదాపు 25 శాతం వరకు పడిపోయాయి. అంటే ఇప్పటికే కరెక్షన్ మొదలైపోయింది.
ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు బంగారాన్ని గుడ్డిగా నమ్మి మోసపోవద్దని ఆయన సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే లాంగ్ టర్మ్ కోసం స్టాక్ మార్కెట్ (Equity) , స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే డెట్ (Debt) మార్కెట్లే గోల్డ్ కంటే మెరుగైన రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. కాబట్టి మీ పోర్ట్‌ఫోలియోను కేవలం బంగారం వైపే కాకుండా, ఇతర రంగాలకు కూడా డైవర్సిఫై చేసుకోవడం చాలా అవసరం.


Click it and Unblock the Notifications