ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ ఇన్వెస్టర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీరును అగ్రరాజ్యం అమెరికా ఎండగడుతోంది. మరోవైపు జోక్యం చేసుకోవద్దని రష్యా హెచ్చరిస్తోంది. దీంతో రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, ఇప్పుడు ప్రారంభమైన యుద్ధం ఎటువైపు దారితీస్తుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. అమెరికా మార్కెట్లు నిన్న నష్టాల్లో ముగిశాయి. పుతిన్ ప్రకటన నేపథ్యంలో భారత్ సహా ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి.

నిమిషాల్లో రూ.8 లక్షల కోట్లు ఆవిరి
భారత స్టాక్ మార్కెట్లు నిన్నటి వరకు వరుసగా ఐదు రోజుల పాటు నష్టపోయాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా వరుస నష్టాల నేపథ్యంలో నిన్నటి వరకు ఇన్వెస్టర్లు రూ.6 లక్షల కోట్లు నష్టపోయారు. కానీ నేడు పుతిన్ యుద్ధ ప్రకటన తర్వాత ఐదు రోజుల్లో నష్టపోయిన దాని కంటే ఎక్కువగా నష్టపోయారు ఇన్వెస్టర్లు. సెన్సెక్స్ నేడు ఓ సమయంలో 2000 పాయింట్లు నష్టపోయింది.
పుతిన్ ప్రకటన తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8 లక్షల కోట్లు పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద క్రితం సెషన్‌లో 255.68 లక్షల కోట్ల నుండి నేడు ప్రారంభ సెషన్‌లో 248 లక్షల కోట్లకు తగ్గింది. జనవరి 17న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.280 లక్షల కోట్లు కాగా, ఇప్పుడు 250 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. అప్పటి నుండి సెన్సెక్స్ 3367 పాయింట్లు పడిపోయింది.

అంతర్జాతీయ మార్కెట్లు ఎలా ఉన్నాయంటే?
రష్యా-ఉక్రెయిన్ పరిస్థితులు ప్రపంచ మార్కెట్లను కుప్పకూల్చాయి. అమెరికా నాస్‌డాక్ క్రితం సెషన్‌లో 2.57 శాతం క్షీణించింది. డౌజోన్స్ 1.38 శాతం, ఎస్ అండ్ పీ 1.84 శాతం క్షీణించింది. యూరోపియన్ మార్కెట్ విషయానికి వస్తే సీఏసీ (ఫ్రాన్స్) 0.10 శాతం, డీఏఎక్స్ (జర్మన్) 0.42 శాతం నష్టపోగా, కేవలం ఎఫ్‌టీఎస్ఈ మాత్రమే స్థిరంగా ముగిసింది. ఇక పుతిన్ ప్రకటన తర్వాత నేడు ఆసియా మార్కెట్లు అన్ని నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
సింగపూర్ నిఫ్టీ 2.85 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 2.80 శాతం, జపాన్ నిక్కీ 1.96 శాతం, హాంగ్ కాంగ్ హాంగ్ షెంగ్ 3.11 శాతం, తైవాన్ వెయిటెడ్ 2.46 శాతం, కోస్పీ 2.38 శాతం, సెట్ కాంపోజిట్ 1.41 శాతం, జకర్తా కాంపోజిట్ 1.63 శాతం, షాంఘై కాంపోజిట్ 0.89 శాతం నష్టపోయాయి. దాదాపు అన్ని దేశాల సూచీలు కూడా కాస్త అటు ఇటుగా 1 శాతం నుండి 3 శాతానికి పైగా నష్టపోయాయి.

చమురు ధరలు ఆకాశానికి...
ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ నేడు 4.50 శాతం లేదా 4.14 డాలర్లు పెరిగి 96.24 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడ్ 4.03 డాలర్లు లేదా 4.30 శాతం పెరిగి 98.09 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే మన వద్ద కూడా త్వరలో భారీగా పెరిగే అవకాశముంది. పరిస్థితి ఇలాగే ఉంటే బ్యారెల్ చమురు 120 డాలర్లకు పెరగవచ్చునని అంటున్నారు. అప్పుడు మన వద్ద పెట్రోల్, డీజిల్ భారీగా పెరగవచ్చు.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications