గ్లోబల్ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఒపెక్ దేశాల ఉత్పత్తి తగ్గింపు అంగీకారం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ డీల్ అనంతరం డౌజోన్స్ ప్యూచర్ చతికిలపడింది. S&P 500 ఫ్యూచర్స్, నాస్‌డాక్ ఫ్యూచర్స్ కూడా నష్టపోయింది. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ 200 పాయింట్లకు దిగువకు ట్రేడ్ అయింది. ఎస్ అండ్ పీ ఫ్యూచర్స్, నాస్‌డాక్‌లు 100 పాయింట్ల చొప్పున నష్టపోయాయి.

గత వారం కోలుకున్న మార్కెట్లు
గత వారం భారత మార్కెట్లు మంచి లాభాలను చూశాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా కాస్త కోలుకున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయనే అంచనాలు, వివిధ దేశాలు పెద్ద ఎత్తున ప్యాకేజీలు ప్రకటిస్తుండటంతో మార్కెట్లు గత వారం కోలుకున్నాయి. కానీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ వారం అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలు దేశీయ మార్కెట్ పైన కూడా ఉండే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

లాక్ డౌన్, ప్యాకేజీ
కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు విధించిన లాక్ డౌన్‌ను మంగళవారం తర్వాత కొనసాగిస్తారా లేదా అనే అంశం మార్కెట్‌కు కీలకం కానుంది. SMEలకు ప్యాకేజీ ప్రకటిస్తారని భావిస్తున్నారు. లాక్ డౌన్‌ను పొడిగించకపోయినా, ప్యాకేజీ ప్రకటించిన ఇది మార్కెట్ సెంటిమెంటును బలపరుస్తుంది.

దశలవారీగా లాక్ డౌన్ తొలగిస్తే.. ప్రధాని కీలక వ్యాఖ్య
దశలవారీగా లాక్ డౌన్‌ను ఎత్తివేస్తే ఆర్థిక కార్యకలాపాలు పాక్షికంగా పుంజుకుంటాయి. ఈ అంచనాలు కూడా గత వారం మార్కెట్‌కు కలిసి వచ్చింది. అయితే లాక్ డౌన్ పొడిగింపు ఎలా ఉంటుందో చూడాలి. కొన్ని నిర్ణయాలతో లాక్ డౌన్ ఎత్తివేస్తారా అనే చర్చ సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్లోబల్ మార్కెట్‌తో పాటు లాక్ డౌన్ ప్రభావం కూడా మార్కెట్ సెంటిమెంటుపై ఆధారపడి ఉంది.
ప్రజల ప్రాణాలతో పాటు జీవనోపాధి కూడా ముఖ్యమేనని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఇది లాక్ డౌన్ నుంచి ఒకింత ఊరట లభించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే నిర్ణయం ఏం వస్తుంది ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు.

9,000 పాయింట్ల వద్ద నిఫ్టీ
నిఫ్టీ-50 ఈ వారం 8,800 - 9,600 మధ్య కదలాడవచ్చునని మార్కెట్ నిపుణుల అంచనా. మార్చి క్వార్టర్ ఫలితాలు ప్రకటించేందుకు, డివిడెండ్లు నిర్ణయించేందుకు బోర్డు సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లపై ఆ ప్రభావం ఉండవచ్చు.

ఈ రంగాల షేర్లు పుంజుకోవచ్చు
చమురు షేర్ ధరలు లాక్ డౌన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ఇప్పటికే పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది. దీంతో తమ ఉత్పత్తిలో కోతను విధిస్తున్నాయి. దీంతో ధరలు పెరగవచ్చు. అలాగే లాక్ డౌన్ సడలిస్తే గిరాకీ పుంజుకోవచ్చు. ఐటీ షేర్లు ఈ వారం ప్రతికూలత చూడవచ్చునని భావిస్తున్నారు. ఫార్మా, వాహన, ఎఫ్ఎంసీజీ, టెలికం రంగాల షేర్లు మాత్రం దూకుడు ప్రదర్శిస్తాయని అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!



Click it and Unblock the Notifications