భారీ లాభాల నుండి నష్టాల్లోకి వెళ్లి.. 50,000 మార్కుకు సెన్సెక్స్
ముంబై: వరుసగా మూడ్రోజుల పాటు భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు (ఏప్రిల్ 29, గురువారం) లాభాల్లో ప్రారంభమై, కాసేపటికి నష్టాల్లోకి వెళ్లినప్పటికీ తిరిగి పుంజుకున్నాయి. సెన్సెక్స్ నేడు 50,000 పాయింట్లు క్రాస్ చేసింది. నిన్న 49,734 పాయింట్ల వద్ద క్లోజ్ అయిన సెన్సెక్స్, నేడు ఓ సమయంలో పాయింట్ల వరకు లాభపడింది. ఉదయం భారీ లాభాల్లో కనిపించినప్పటికీ, అంతలోనే నష్టాల్లోకి వెళ్లింది. తిరిగి పుంజుకున్నప్పటికీ 200 పాయింట్ల లాభంతో కదలాడుతోంది. నిఫ్టీ కూడా నేడు కీలకమైన 15000 పాయింట్లను క్రాస్ చేసింది. ఆ తర్వాత ఆ దిగువకు వచ్చింది. అయినప్పటికీ సూచీలు లాభాల్లో ఉన్నాయి.

సెన్సెక్స్ భారీ లాభాల నుండి కిందకు..
సెన్సెక్స్ నిన్న 49,734 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నేడు ప్రారంభంలోనే 300 పాయింట్లకు పైగా ఎగిసి 50,093.86 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 50,375.77 గరిష్టాన్ని, 49,535.98 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2.00 సమయానికి సెన్సెక్స్ 110.77 (0.22%) పాయింట్లు లాభపడి 49,826.30 పాయింట్ల వద్ద కదలాడింది. నిఫ్టీ 14,979.00 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,044.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,814.45 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1 సమయానికి నిఫ్టీ +27.15 (0.18%) పాయింట్లు ఎగిసి 18,891.70 పాయింట్ల వద్ద కదలాడింది.

టాప్ లూజర్స్
నేటి మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో JSW స్టీల్ 7.00 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 5.70 శాతం, టాటా స్టీల్ 5.00 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.70 శాతం, హిండాల్కో 1.23 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్ 2.19 శాతం, హీరో మోటో కార్ప్ 1.88 శాతం, ఎస్బీఐ 1.57 శాతం, HCL టెక్ 1.56 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.39 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.19 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.25 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.90 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.35 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.04 శాతం, నిఫ్టీ ఐటీ 0.21 శాతం, నిఫ్టీ మీడియా 0.53 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.60 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.06 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.36 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ 0.36 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.00 శాతం, నిఫ్టీ మెటల్ 2.97 శాతం, నిఫ్టీ ఫార్మా 0.51 శాతం లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications