Stock Market: బేర్స్ బజారుగా మారిన దలాల్ స్ట్రీట్.. నష్టాల్లో సెన్సెక్స్-నిఫ్టీ..
Bear Market: వరుగస పతనం తర్వాత నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి బెంచ్ మార్క్ సూచీ పతనాన్ని కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.48 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 206 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 52 పాయింట్ల మేర నష్టంతో ఇంట్రాడేలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 163 పాయింట్లు నష్టపో, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 107 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో నేడు ఐపీవో అరంగేట్రంతో పాటు కార్పొరేట్ క్యూ4 ఫలితాల కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎన్ఎస్ఈలో బీపీసీఎల్, కోల్ ఇండియా, టాటా స్టీల్, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్టీపీసీ, ఎస్బీఐఎన్, మారుతీ, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్, టాటా కన్జూమర్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, కోటక్ బ్యాంక్, రిలయన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లైఫ్ కంపెనీల షేర్లు లాభాలతో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో డాక్టర్ రెడ్డీస్, హిందుస్థాన్ యూనీలివర్, ఏషియన్ పెయింట్స్, ఎల్ టి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హీరో మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, సిప్లా, ఐటీసీ, టీసీఎస్, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications