Stock Market: నూతన ఏడాది తొలిరోజే నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ఏమైందంటే..??
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త ఏడాది కళ ఎక్కడా కనిపించలేదు. నేడు మార్కెట్లు ముందుగా ఫ్లాట్ ప్రారంభాన్ని నమోదు చేసి తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధానంగా ఆటో రంగాలకు చెందిన కంపెనీల షేర్లు ఫోకస్‌లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.33 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 172 పాయింట్ల నష్టంలో ఉండదా.. మరో కీలక సూచీ నిఫ్టీ 41 పాయింట్ల మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 111 పాయింట్ల నష్టంతో ఇంట్రాడేలో ముందుకు సాగుతోంది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 135 పాయింట్ల మేర లాభాలతో ముందుకు సాగుతోంది. అయితే క్రమేపీ మార్కెట్ల నష్టాల తగ్గి తిరిగి లాభాల్లోకి పుంజుకుంటాయని తెలుస్తోంది.

2024 ప్రారంభం కాగానే ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లకు గోల్డిలాక్స్ దృశ్యం. ఆర్థిక వ్యవస్థలో వృద్ధి వేగం బలంగా ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్, వికె విజయకుమార్ వెల్లడించారు. FY24లో 7% GDP వృద్ధిని అనుసరించి, FY25లో 6.7% వృద్ధికి తగిన కార్పొరేట్ ఆదాయాలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ సాఫ్ట్ ల్యాండింగ్‌కు వెళుతున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. US 10-సంవత్సరాల బాండ్ దిగుబడి 3.87 శాతంగా ఉంది. 2024లో FPI ఇన్‌ఫ్లోలు బలంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్, కోల్ ఇండియా, గ్రాసిమ్, బీపీసీఎల్, యూపీఎల్, నెస్లే, హీరో మోటార్స్, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, ఎస్బీఐ, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, దివీస్ ల్యాబ్, టైటాన్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎయిర్ టెల్, బ్రిటానియా, హిందుస్థాన్ యూనీలివర్, టాటా కన్జూమర్, ఎల్ టిఐఎమ్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications