Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. స్వల్ప నష్టాల్లో ముందుకు..
Market Opening: నిన్న లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఒడిదొడుకులతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఆరంభంలోనే సూచీలు స్వల్ప నష్టాలతో ముందుకు సాగుతున్నాయి.
ఉదయం 9.23 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 31 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 4 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 127 పాయింట్ల నష్టంలో ఉంది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ సైతం 55 పాయింట్లను కోల్పోయి మార్కెట్లు ఎరుపెక్కాయి. ప్రధానంగా దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు గడచిన 7 రోజులుగా లాభాల స్వీకరణతో రూ.7000 కోట్లు విలువైన పెట్టుబడులను విక్రయించటం ఒత్తిడిని పెంచుతోంది.

ఎన్ఎస్ఈలో సిప్లా, ఎస్బీఐ లైఫ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనీలివర్, టైటాన్, దివీస్ ల్యాబ్, హీరో మోటార్స్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, విప్రో, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, ఐటీసీ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, ఎస్బీఐ, మారుతీ, ఎయిర్ టెల్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, ఎల్ టి, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications