Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాలను నేడు కూడా కొనసాగిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు పూర్తిగా బేర్స్ చేతిలోకి జారిపోయిన వేళ కీలక బెంచ్ మార్క్ సూచీల్లో పతనం పతాక స్థాయిలకు చేరుకుంటోంది. ఈ క్రమంలో రూపాయి మారకపు విలువ సైతం భారీగానే క్షీణించింది.
ఉదయం 9.26 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 332 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 87 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 376 పాయింట్లు నష్టంతో ఇంట్రాడేలో కొనసాగుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం స్వల్పంగా 18 పాయింట్ల మేర లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అయితే ఈ క్రమంలో మార్కెట్లో ఫోకస్‌లో ఉన్న జియో ఫైనాన్షియల్స్ స్టాక్ మాత్రం 3 శాతం మేర లాభపడి ముందుకు కొనసాగుతోంది.

ఎన్ఎస్ఈలో ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, టైటాన్, నెస్లే, ఎస్బీఐ లైఫ్, హీరో మోటార్స్, కోల్ ఇండియా, మారుతీ, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, రిలయన్స్, ఎయిర్ టెల్, బీపీసీఎల్, ఐటీసీ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో ఆరంభంలో కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో ఎల్‌టిఐఎమ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, ఎన్టీపీసీ, టీసీఎస్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్ సర్వ్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, విప్రో, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు నష్టాల్లో తమ ప్రయాణాన్ని నేడు కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications