Stock Market: కొత్త వారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్ మెుదలుపెట్టాయి. ఉదయం ట్రేడింగ్ సెషన్లో ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో రంగాలకు చెందిన కంపెనీలు మార్కెట్లను కిందకు లాగాయి.
ఉదయం 9.39 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 85 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో సూచీ నిఫ్టీ 12 పాయింట్ల స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ స్టాక్ 87 పాయింట్ల నష్టంలో ట్రేడవుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 139 పాయింట్ల లాభంలో ముందుకు కొనసాగుతోంది.

NSEలో దివీస్ ల్యాబ్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్, ఎల్ టిఐఎమ్, అపోలో హాస్పిటల్స్, ఓఎన్జీసీ, హీరో మోటార్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఐషర్ మోటార్స్, పవర్ గ్రిడ్, టీసీఎస్, విప్రో, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, యూపీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, మారుతీ కంపెనీల షేర్లు లాభాలతో ఇంట్రాడేలో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఎల్ టి, కోటక్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్స్, నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా, హిందుస్థాన్ యూనీలివర్, ఐటీసీ, బ్రిటానియా, గ్రాసిమ్, యూపీఎల్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సహా మరిన్ని కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications