Stock Market: లాభాల్లో ట్రేడింగ్ మెుదలు పెట్టిన సెన్సెక్స్, నిఫ్టీ.. 3 ఐపీవోల లిస్టింగ్..
Stock Market: నిన్న భారీ ర్యాలీ తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో తమ ప్రయాణాన్ని మెుదలు పెట్టాయి. ప్రధానంగా మార్కెట్లు నేడు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.22 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 52 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 146 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 52 పాయింట్ల లాభంలో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ రోజు ప్రధానంగా టాటా టెక్నాలజీస్, ఫ్లెయిర్, గాంధార్ ఆయిల్ ఐటపీవోలు మార్కెట్లో నేడు జాబితా అవుతున్నాయి.

ఎన్ఎస్ఈలో హీరో మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, దివీస్ ల్యాబ్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, గ్రాసిమ్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, బ్రిటానియా, హిందుస్థాన్ యూనీలివర్, టైటాన్, యూపీఎల్, ఎల్ టి, హెచ్సీఎల్, కోల్ ఇండియా సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కొ, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, రిలయన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, విప్రో, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, టాటా మోటార్స్, సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, ఐటీసీ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications