Stock Market: ఈ వారం తొలిరోజు దేసీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభాలను నమోదు చేశాయి. గతవారం నష్టాలను పూడ్చాయనుకునేలోపు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్లు ఆరంభం నుంచి నష్టాల్లో మెుదలై భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.

మార్కెట్ సూచీలు..
ఉదయం 10.08 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 404 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 103 పాయింట్ల నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 352 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ 88 పాయింట్లను కోల్పోయింది. ప్రధానంగా ఇన్వెస్టర్లు నిన్న మార్కెట్ ర్యాలీలో వచ్చిన లాభాలను స్వీకరించేందుకు మెుగ్గు చూపటంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయని నిపుణులు చెబుతున్నారు.

గమనించాల్సిన వార్తలు..
టాటా గ్రూప్ దేశంలో తన తొలి ఐఫోన్ల తయారీని మెుదలు పెట్టేందుకు మరో అడుగు దూరంలో ఉన్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం డీల్ చర్యల అంతిమ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి నాటికి ఇది పూర్తవుతుందని వర్గాల ద్వారా సమాచారం తెలుస్తోంది. ఇదే సమయంలో టీసీఎస్ గతంలో కంటే మెరుగైన లాభాలను నమోదు చేసింది. ఫిన్ టెక్ స్టార్టప్ పేటీఎం డిసెంబరులో రుణ మంజూరు వ్యాపారాన్ని 330 శాతం మేర వృద్ధి చేసింది. ఇది కంపెనీ లాభదాయకతను పెంచేందుకు దోహదపడుతోందని నిపుణులు అంచనావేస్తున్నారు.

టాప్ గెయినర్స్..
NSE సూచీలో టాటా మోటార్స్, టాటా స్టీల్, హిందాల్కొ, ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టాటా కన్జూమర్, అపోలో హాస్పిటల్, హిందుస్థాన్ యూనీలివర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, దివీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్, కోల్ ఇండియా, ఎల్ అండ్ టీ కంపెనీల షేర్లు లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..
టీసీఎస్, ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, హీరో మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా, ఐటీసీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, మారుతీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, సిప్లా, ఎన్టీపీసీ కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications