Stock Market: భారీ లాభాల్లో మెుదలైన మార్కెట్లు.. Sensex, Nifty దూకుడు..
Stock Market: ఉదయం ఉల్లాసంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి లాభాల స్వింగును కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో జొమాటో షేర్లు భారీగా చేతులు మారాయి.
ఉదయం 9.18 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 262 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 85 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 173 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 282 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. ప్రధానంగా సెన్సెక్స్ సూచీ రేంజ్ బ్రేకింగ్ కారణంగా మంచి పురోగతిని నమోదు చేసినట్లు నిపుణులు చెబుతున్నారు.

NSEలో ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, విప్రో, అదానీ ఎంటర్ ప్రైజెస్, గ్రాసిమ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, హిందాల్కొ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, యూపీఎల్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా కంపెనీల షేర్లు మాత్రమే నష్టాలతో కొనసాగుతూ టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications