Stock Market: బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక ప్రకటన.. సెన్సెక్స్, నిఫ్టీలో బుల్ జోరు..
Opening Bell: రెండు రోజుల విధ్వంసం తర్వాత ప్రపంచ మార్కెట్లు నేడు తిరిగి తేరుకున్నాయి. దీనికి కారణాన్ని పరిశీలిస్తే.. మార్కెట్ అస్థిరత కొనసాగితే సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచబోదని బ్యాంక్ ఆఫ్ జపాన్ డిప్యూటీ గవర్నర్ షినిచి ఉచిడా స్పష్టం చేశారు. ఈ హామీతో ఆసియా స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. ఈ ప్రకటన యెన్‌లో పదునైన పెరుగుదల తర్వాత పెట్టుబడిదారుల ఆందోళనలను తగ్గించింది.
ఈ ప్రకటన భారత ఈక్విటీ మార్కెట్లను సైతం తిరిగి బుల్ ట్రెండ్ లోకి తీసుకొచ్చింది. ఉదయం 9.50 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 665 పాయింట్లు, నిఫ్టీ 235 పాయింట్లు పెరిగాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 258 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 820 పాయింట్లు గెయిన్ అయ్యింది. దీంతో అన్ని రంగాలకు చెందిన సూచీలు ప్రస్తుతం లాభాలతో ముందుకు సాగుతున్నాయి. అలాగే నిఫ్టీ సూచీ 24,250 స్థాయి వద్ద ముందుకు సాగుతోంది.

ఎన్ఎస్ఈలో ఓఎన్జీసీ, కోల్ ఇండియా, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, హీరో మోటార్స్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ, విప్రో, ఎల్ టిఐఎమ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ఇంట్రాడేలో ముందుకు సాగుతున్నాయి. మెుత్తానికి రెండు రోజులు రక్తమోడిన ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలియోలు తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనిపించటంతో దేశీయ పెట్టుబడిదారులు నేడు సంతోషంలో ముందుకు సాగుతున్నారు.


Click it and Unblock the Notifications