Stock Market: మార్కెట్లకు గ్రహణం.. మిశ్రమంగా మార్కెట్లు.. నిన్నటి దారిలోనే..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో స్ధబ్దత కొనసాగుతోంది. మార్కెట్లు ఈ రోజు ప్రారంభంలోనే ఊగిసలాటలు మెుదలు పెట్టాయి. అయితే మార్కెట్లలో జోష్ నింపే విషయాల కోసం ఇన్వెస్టర్లు నిశితంగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల ఆర్థిక ఫలితాల కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మార్కెట్ సూచీలు..
ఉదయం 9.42 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 123 పాయింట్లు, నిఫ్టీ 33 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 71 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 34 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. దీనికి ముందు ఆరంభంలో సూచీలు కొంత నష్టాలు లాభాల్లో ఊగిసలాడుతూ కొనసాగాయి.

టాప్ గెయినర్స్..
ఈ సమయంలో ఎన్ఎస్ఈ సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, కోల్ ఇండియా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ అండ్ టీ, టైటాన్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, పవర్ గ్రిడ్, మారుతీ, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సిప్లా, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ వంటి కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..
దివీస్ ల్యాబ్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, హిందాల్కొ, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్, బ్రిటానియా, ఓఎన్జీసీ, హీరో మోటార్స్, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications