Market Next Week: ప్రస్తుతం దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికల హడావికి కొనసాగుతున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు నవంబర్ చివరి వారంలోకి ప్రవేశిస్తున్న వేళ ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది.
రానున్న వారంలో గ్లోబల్ మార్కెట్ల నుంచి ముఖ్యమైన మైక్రో ఎకనమిక్ డేటా, ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు, జీడీపీ డేటా, ఆటో సేల్స్, విదేశీ పెట్టుబడులతో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్లకు నుంచి రానున్న సమాచారం మార్కెట్లను ప్రభావితం చేయనుంది. ఇందులో ప్రధానమైనది దేశంలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికలని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాలకు ముందు దేశీయ స్టాక్ మార్కెట్లు కొంత కన్సాలిడేటెడ్ ట్రెండ్ కొనసాగిస్తూ గత వారాన్ని స్వల్ప లాభాలతో ముగించాయి.

గడచిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 175.31 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ 62.9 పాయింట్లు వృద్ధి చెందింది. అయితే స్మాల్ క్యాప్స్ ఈ వారంలో 0.39 శాతం నష్టపోయాయి. 2023లో ఇప్పటివరకు స్మాల్ క్యాప్స్ 42 శాతం, మిడ్ క్యాప్స్ 33 శాతం మేర లాభపడ్డాయి. గడచిన శుక్రవారం ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సూచనలు, ఐటీ రంగంతో పాటు ఎఫ్ఎమ్‌సీజీ షేర్ల పతనంతో సూచీలు ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో చెప్పుకోదగ్గ కదలికలు లేనప్పటికీ.. నిఫ్టీ 50 దాని వారపు విజయ పరంపరను పొడిగించగలిగింది.
వారంలో ఇన్వెస్టర్ల దృష్టి ఐపీవోలపై మళ్లుతుందని, ప్రాఫిట్ బుకింగ్ చూసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. అలాగే పండుగ డిమాండ్ పుంజుకోవడంతో కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ వంటి రంగాలు దూకుడును ప్రదర్శించాయి. ఇక ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా అన్‌సెక్యూర్డ్ రుణాలను ఆర్‌బీఐ పరిశీలించినప్పటికీ, బ్యాంకింగ్ ఇండెక్స్ ఈ వారం స్థితిస్థాపకతను ప్రదర్శించింది. అయితే రేపటి వారంలో నవంబర్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల షెడ్యూల్ గడువు ముగియడం వల్ల అస్థిరత ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications