Stock Markets: గతవారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రానున్న వారం మార్కెట్లపైనే అందరి దృష్టి ఉంది. ఇన్వెస్టర్లు గమనించాల్సిన విషయాలను గమనిస్తే..
దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశాలను గమనిస్తే వడ్డీ రేట్లు, స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం వంటివి ముందు వరుసలో ఉన్నాయి. దీంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల కార్యకలాపాలు, కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు మార్కెట్ దిశానిర్దేశం చేసేందుకు కీలకం కానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే సేవల రంగానికి సంబంధించిన HSBC PMI డేటా సోమవారం విడుదల కానుంది.

రానున్న వారంలో అందరి దృష్టి ప్రపంచ మార్కెట్లపైనే ఉంటుందని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం స్థిరత్వం తర్వాత, మార్కెట్ ఇప్పుడు బలహీన సంకేతాలను చూపుతున్నాయని అన్నారు. వాస్తవానికి ఈ ట్రెండ్ భారతీయ మార్కెట్ల బలాన్ని పరీక్షిస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే మెరుగైన లిక్విడిటీ కారణంగా భారత మార్కెట్లు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాయని, అలాగే ఆగస్టు 8న జరగనున్న రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం కీలకమని మీనా పేర్కొన్నారు. ఇదే క్రమంలో మొదటి త్రైమాసిక ఫలితాల చివరి రౌండ్ తర్వాత మార్కెట్‌లో కొన్ని స్టాక్-నిర్దిష్ట కార్యకలాపాలు కనిపించవచ్చని అన్నారు.
భారత స్టాక్ మార్కెట్ల దిశకు సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి వచ్చే ప్రవాహాలు కూడా ముఖ్యమైనవిగా మీనా పేర్కొన్నారు. అలాగే రానున్న వారం భారతీ ఎయిర్‌టెల్, బీఈఎంఎల్, ఓఎన్‌జీసీ, ఎన్‌హెచ్‌పీసీ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎంఆర్‌ఎఫ్ కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించబోతున్నాయి. ఇవి మార్కెట్లలో పెద్ద కదలికలకు దారితీయవచ్చు. ఇదే క్రమంలో రానున్న వారంలో ఇన్వెస్టర్లకు ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షా సమావేశం రేట్ల ఔట్‌లుక్‌పై కొంత సూచనను ఇవ్వటం మార్కెట్లకు కీలకమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. అలాగే అధిక వాల్యుయేషన్‌ల కారణంగా మార్కెట్‌లో కొంత బలహీనత ఉండవచ్చని పేర్కొన్నారు. అయితే నిపుణుల అంచనాల ప్రకారం ప్రస్తుతానికి ఆర్బీఐ తన వడ్డీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించొచ్చని అన్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications