Stock Market: మార్కెట్లకు జపాన్ ఝలక్.. 650 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. పాపం ఇన్వెస్టర్లు..
Stock Market: అరె నిన్నే మార్కెట్లు లాభాల్లోకి తిరిగి వచ్చాయి అంతా నార్మల్ అయిందని ఇన్వెస్టర్లు భావించారు. ఇదే క్రమంలో ఉదయం మార్కెట్లు సైతం ఫ్లాట్ గా ఆరంభమయ్యాయి. అమెరికా ఆర్థిక మాంద్యంతో పాటు చైనాలో విజృంభిస్తున్న కరోనా కేసులు అంతర్జాతీయ మార్కెట్లలో భయాలను విపరీతంగా పెంచేశాయి. ఆ ప్రభావం కూడా దేశీయ మార్కెట్ సూచీలను నష్టాల్లోకి నెట్టింది.

జపాన్ ప్రకటన..
పదేళ్ల బాండ్స్ రాబడిని ప్రస్తుతం ఉన్న 0.25 శాతం నుంచి 0.50 శాతానికి పెంచేందుకు అనుమతిస్తామని బ్యాంక్ ఆఫ్ జపాన్ వెల్లడించటంతో ఆ ప్రభావం ఈక్విటీ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. దీనివల్ల జపాన్ లో బాండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ నిలిచిపోయింది. జపాన్ మార్కెట్ సూచీ JPY కూడా ఈ క్రమంలో 3 శాతం వరకు నష్టపోయింది. ఈ ప్రభావం ప్రపంచం వ్యాప్తంగా ఉన్న మార్కెట్లపై పడటం వల్ల అన్ని మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది.

నష్టాల్లో దేశీయ సూచీలు..
ఉదయం 11.22 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 650 పాయింట్ల నష్టంలో ఉండగా.. నిఫ్టీ సూచీ 193 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 361, నిఫ్టీ మిడ్ క్యాప్ 314 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్, రియల్టీ రంగాల స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీంతో నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు ఏకంగా 1 శాతం మేర నష్టపోయాయి.

టాప్ గెయినర్స్ & లూజర్స్..
ఈ క్రమంలో కేవలం అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ మాత్రమే నిఫ్టీ-50 సూచీలో లాభాల్లో కొనసాగుతోంది. ఇదే సమయంలో హిందాల్కొ, యూపీఎల్, ఎస్బీఐ లైఫ్, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్ టెల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, హిందుస్థాన్ యూనీలివర్, పవర్ గ్రిడ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఏషియన్ పోయింట్స్, ఓఎన్జీసీ స్టాక్స్ టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications