గురువారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 16 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 159 పాయింట్లు లాభపడి 72,311 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 54 పాయింట్లి పెరిగి 21,985 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో పవర్ గ్రిడ్, ఎంఅండ్ఎం, ఎన్టీపీ, ఎస్బీఐఎన్, హెచ్ సీఎల్ టెక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టెక్ మహింద్రా, హిందుస్థాన్ యూనిలివర్, విప్రో, టాటా స్టీల్, సన్ ఫార్మా, కొటాక్ మహింద్రా బ్యాంక్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్ లాభాల్లో ట్రేడవుతోన్నాయి.
భారతీ ఎయిర్ టెల్, ఏసియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, మారుతి, ఐటీసీ నష్టాల్లో కొనసాగుతోన్నాయి.పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి 10.5% వృద్ధిని నమోదు చేసింది. ఎఫ్‌వై 24 అక్టోబర్-డిసెంబర్ కాలానికి రూ. 4,028.3 కోట్లకు ఏకీకృత నికర లాభం, అధిక పన్ను వ్యయం ఉన్నప్పటికీ, ఆరోగ్యకరమైన ఆపరేటింగ్ నంబర్లు విడుదల చేసింది. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 2.6% వృద్ధితో రూ.11,549.8 కోట్లకు చేరుకుంది.

డిసెంబర్ 24తో ముగిసిన త్రైమాసికంలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సంవత్సరానికి 17.3% క్షీణతతో రూ. 301.5 కోట్ల వద్ద నమోదైంది. ఆరోగ్యవంతమైన నిర్వహణ సంఖ్యలు ఉన్నప్పటికీ రూ. 91.53 కోట్ల అనూహ్యంగా నష్టం వాటిల్లింది. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 9.5% వృద్ధితో రూ.3,804 కోట్లకు చేరుకుంది. రియల్టీ సంస్థ శోభా లిమిటెడ్ ఫిబ్రవరి 7న డిసెంబర్ 2023తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 53 శాతం క్షీణించి రూ.15.08 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications