Market Closing: ఉదయం భారీ నష్టాల్లోకి జారుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ముగింపు సమయానికి లాభాల్లోకి వచ్చాయి. కీలక బెంచ్ మార్క్ సూచీలు ఈ క్రమంలో లాభాలతో ప్రయాణాన్ని ముగించాయి. అయితే నేడు ప్రభుత్వ బ్యాంకులు భారీ నష్టాలను నమోదు చేశాయి.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 113 పాయింట్లు లాభపడగా, మరో కీలక సూచీ నిఫ్టీ 49 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 333 పాయింట్లు గెయిన్ అవగా.. చివరిగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 203 పాయింట్ల లాభంతో నేడు ట్రేడింగ్ ముగించాయి. నేడు మార్కెట్లు ముగింపునాటికి నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ మెటల్ నష్టపోగా.. నిఫ్టీ ఫార్మా మాత్రం లాభపడింది.

ఎన్ఎస్ఈలో సిప్లా, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, దివీస్ ల్యాబ్, బ్రిటానియా, హిందాల్కొ, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, ఎల్ టి, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.
ఇదే క్రమంలో టాటా మోటార్స్, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎస్బీఐ, టైటాన్, ఓఎన్జీసీ, ఎయిర్ టెల్, నెస్లే, ఐటీసీ, రిలయన్స్, ఎస్బీఐ లైఫ్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, హిందుస్థాన్ యూనీలివర్, అపోలో హాస్పిటల్స్, ఎల్‌టిఐఎమ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications