Stock Market: లాభాల్లో దూసుకుపోతున్న మార్కెట్లు.. సుడిగుండంలో బ్యాంకింగ్ స్టాక్స్..
Opening Bell: నిన్నటి నష్టాల నుంచి దేశీయ బెంచ్ మార్క్ సూచీలు తేరుకున్నాయి. అయితే ఇప్పటికీ బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రం నష్టాల తుఫానును దాటలేదు. ఈ క్రమంలో టెక్ మహీంద్రా, హీరో మోటార్స్, డీఎల్ఎఫ్ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్ల ఫోకస్‌లో ఉన్నాయి.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 144 పాయింట్ల లాభంలో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 57 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఈ క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ ఆరంభ నష్టాల నుంచి తేరుకుని 128 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 450 పాయింట్ల మెగా లాభాన్ని నమోదు చేసింది. ఇంట్రాడేలో నేడు టెక్ మహీంద్రా స్టాక్ నష్టాల్లో ఉండగా మ్యాన్‌కైండ్ ఫార్మా స్టాక్ మాత్రం లాభాలతో ముందుకు సాగుతోంది.

ఎన్ఎస్ఈలో ఎయిర్ టెల్, కోల్ ఇండియా, హిందాల్కొ, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, టీసీఎస్, ఎల్ టిఐఎమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, విప్రో, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, హచ్సీఎల్ టెక్నాలజీసం కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో టెక్ మహీంద్రా, నెస్లే, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ టి, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, ఓఎన్జీసీ, ఐటీసీ, బ్రిటానియా, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఆటో రంగాలకు చెందిన కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications