Stock Market: రికార్డుల దిశగా మార్కెట్లు.. లాభాల్లో Sensex, Nifty సూచీలు..
Market Opening: రికార్డుల ర్యాలీలో కొంత ఒడిదొడుకుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రీఓపెనింగ్ సెషన్లోనూ లాభాలను నమోదు చేశాయి.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 365 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 104 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 201 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 283 పాయింట్ల మేర లాభాలతో ముందుకు సాగుతున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు లాభాల ర్యాలీని కొనసాగించటంతో పాటు నేడు ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అవ్వటం కలిసొచ్చే అంశంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ ఇన్వెస్టర్లు అమెరికా ద్రవ్యోల్బణం డేటా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎన్ఎస్ఈలో నెస్లే, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, హీరో మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, విప్రో, టాటా కన్జూమర్, ఎస్బీఐ లైఫ్, కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, రిలయన్స్, సన్ ఫార్మా, గ్రాసిమ్, దివీస్ ల్యాబ్, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, టీసీఎస్, ఎల్ టిఐఎమ్, ఇన్ఫోసిస్, యూపీఎల్, హిందాల్కొ, ఎయిర్ టెల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, టాటా స్టీల్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఈ క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ కంపెనీల షేర్లు మాత్రమే నష్టాలతో టాప్ లూజర్ల జాబితాలో నిలిచాయి. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ ముందర బ్రాక్ డీల్ సెషన్లో నిప్పాన్, ఆస్ట్రల్, శ్రీరామ్ పిస్టన్స్ కంపెనీల షేర్లు పెద్ద మెుత్తంలో చేతులు మారాయి.


Click it and Unblock the Notifications