Stock Market: కొత్తవారం మార్కెట్లలో సూపర్ జోష్.. లాభాల్లో Sensex, Nifty..!
Opening Bell: గతవారం మార్కెట్ల నష్టాలను అధిగమించి నేడు బుల్ జోరు కొనసాగుతోంది. ప్రధానంగా ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండటం, అమెరికా మార్కెట్లు సానుకూలంగా ఉండటం దీనికి దోహదపడుతోంది.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 412 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో సూచీ నిఫ్టీ 120 పాయింట్ల మేర లాభంతో ఇంట్రాడేలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 406 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 183 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో యెస్ బ్యాంక్, డీఎల్ఎఫ్, వేదాంత కంపెనీల షేర్లు ఫోకస్ లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోల్ ఇండియా, ఎస్బీఐ, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, సన్ ఫార్మా, హిందాల్కొ, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, అపోలో హాస్పిటల్స్, హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, ఐటీసీ, దివీస్ ల్యాబ్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్ టిఐఎమ్, హీరో మోటార్స్, ఐషర్ మోటార్స్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications