నిన్న స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు నేడు ర్యాలీని తిరిగి ప్రారంభించాయి. ప్రధానంగా 2024లో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుకు వెళ్లనున్నట్లు సంకేతాలు మార్కెట్లలో కొత్త జోష్ నింపుతున్నాయి.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 652 పాయింట్ల లాభాలంతో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 181 పాయింట్ల మేర లాభాలతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 621 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 433 పాయింట్ల మేర లాభాలతో ఇండ్రాడేలో ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లను పరిశీలిస్తే డౌజోన్స్ సూచీ రికార్డు గరిష్ఠాలను తాకగా.. ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లో సానుకూలంగా కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో అదానీ పోర్ట్స్, హిందాల్కొ, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్ టిఐఎమ్, ఎన్టీపీసీ, విప్రో, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, ఓఎన్జీసీ, కోటక్ బ్యాంక్, ఎల్ టి సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, టాటా కన్జూమర్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, సిప్లా, టైటాన్, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనీలివర్, బీపీసీఎల్, బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications