May Market Holidays: సాధారణంగా స్టాక్ మార్కెట్లు శనివారం, ఆదివారం సెలవులో ఉంటాయని మనందరికీ తెలిసిందే. దీనికి తోడు మరికొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే మూతపడుతుంటాయని మనందరికీ తెలుసు. ఈ క్రమంలో మే 2024లో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ మూతపడే రోజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళితే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ మే నెలలో సాధారణ సెలవుదినాల్లో కాకుండా మరో 2 రోజుల పాటు మూతపడనున్నాయి. ముందుగా మే 1న స్టాక్ మార్కెట్లకు సెలవు. వాస్తవానికి మే 1న మహారాష్ట్ర దినం. దేశంలో మాట్లాడే భాషల ఆధారంగా రాష్ట్రాలను విభజించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మే 1, 1960లో మరాఠీ మాట్లాడేవారికి ప్రత్యేకంగా మహారాష్ట్ర ఏర్పాటు చేయబడింది. దీనికి తోడు మే 1 కార్మికుల దినోత్సవం కూడా ఉంది.

దీనికి తోడు దేశీయ స్టాక్ మార్కెట్లు మే 20న కూడా మూతపడనున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవి ప్రస్తుతం విడతలవారీగా జరుగుతున్న క్రమంలో మహారాష్ట్ర ముంబై ప్రాంతంలో ఎన్నికలకు మే 20న ఐదవ విడతలో భాగంగా జరుగుతున్నాయి. ఇందులో ముంబైలోని 6 లోక్ సభ స్థానాలకు ఎన్నిక నిర్వహించబడుతోంది. మహారాష్ట్రలో ఎన్నికలు 5 విడతలుగా నిర్వహించాలని నిర్ణయించగా.. ఇప్పటికే ఏప్రిల్ 19, ఏప్రిల్ 26న రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. మిగిలిన మూడు మే 7, మే 13, మే 20న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపట్టాలని ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయించింది.
2024లో స్టాక్ మార్కెట్లకు సెలవులు..
మే 1, 2024- మహారాష్ట్ర దినోత్సవం
మే 20, 2024- జనరల్ ఎలక్షన్స్
జూన్ 17, 2024- బక్రీద్
జూన్ 17, 2024- ముహర్రం
ఆగస్టు 15, 2024- స్వాతంత్ర్య దినోత్సవం
అక్టోబర్ 2, 2024- గాంధీ జయంతి
నవంబర్ 1, 2024- దీపావళి
నవంబర్ 15, 2024- గురునానక్ జయంతి
డిసెంబర్ 25, 2024- క్రిస్టమస్


Click it and Unblock the Notifications