Stock Market: కొంప ముంచిన కరోనా భయాలు.. అమెరికా నుంచి ఇండియా వరకు బేర్స్ జోరు..
Market Opening: నిన్న దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచ మార్కెట్లు సైతం నష్టాల బాట పట్టడంతో నేడు సూచీలు ప్రారంభంలోనే కుప్పకూలాయి.
వాస్తవానికి ఇటీవల గణనీయంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలతో ప్రభుత్వాలు, వ్యాపారులు అప్రమత్తమౌతున్నారు. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లలో సైతం భయాలు కొనసాగుతున్నాయి. దీంతో అమెరికా నుంచి ఇండియావరకు అనేక మార్కెట్లలో పెట్టుబడిదారులు ముందస్తు జాగ్రత్తలో భాగంగా లాభాల స్వీకరిస్తున్నారు. దీంతో మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. నిన్న ఒక్కరోజే జరిగిన అమ్మకాల ఒత్తిడి కారణంగా స్టాక్ మార్కెట్లలో బేర్స్ ర్యాలీ కొనసాగి ఇన్వెస్టర్ల సంపద రూ.9 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది.

కరోనా భయాలతో బుల్స్ వెనుకడుగు వేయగా.. బేర్స్ రంగంలోకి దిగి తమ సత్తా చాటుతున్నారు. దీంతో ఉదయం 9.17 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్333 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 113 పాయింట్ల నష్టంతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ సూచీ 426 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 576 పాయింట్ల మేర నష్టపోయి ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.
ఎన్ఎస్ఈలో ఓఎన్జీసీ, రిలయన్స్, అదానీ పోర్ట్స్, యూపీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో యాక్సిస్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్, హీరో మోటార్స్, బ్రిటానియా, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐషరే మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టి, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎయిర్ టెల్, కోటక్ బ్యాంక్, మారుతీ, టైటాన్, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications