Market Crash: సూచీల శిఖరాలతో కరెక్షన్.. ఇన్వెస్టర్ల సేఫ్ గేమ్.. మార్కెట్ క్షీణత
Market Correction: గత కొన్ని రోజులుగా రికార్డులతో దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు లాభాలను బుకింగ్ చేసుకోవటంతో మార్కెట్లు ఒడిదొడుకులకు గురయ్యాయి.
మార్కెట్ల క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 284 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 86 పాయింట్ల మేర నష్టపోయాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 134 పాయింట్లను కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 379 పాయింట్ల మేర నష్టంతో ట్రేడింగ్ ముగిసింది. మార్కెట్ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరుకున్న తర్వాత కూల్ అవ్వటం ప్రారంభించాయి.

ఈరోజు వారాంతపు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్‌పయిరీ కావటంతో మార్కెట్లు కొంత ఒడిదొడుకుల్లో ట్రేడయ్యాయి. మిడ్ క్యాప్ నిఫ్టీ సూచీ 1 శాతం మేర నష్టపోయింది. చివరికి మార్కెట్లు నెగటివ్ ముగింపును నమోదు చేశాయి.
ఎన్ఎస్ఈలో దివీస్ ల్యాబ్స్, ఎల్ టి, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, ఐటీసీ, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటార్స్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.

ఇదే క్రమంలో బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, గ్రాసిమ్, యూపీఎల్, బ్రిటానియా, నెస్లే, ఎస్బీఐ లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్, సిప్లా, అపోలో హాస్పిటల్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ట్రేడింగ్ ముగించాయి.


Click it and Unblock the Notifications