Market Closing: ఉదయం లాభాలతో ఊరించిన దేశీయ స్టాక్ మార్కెట్లు తర్వాత నష్టాల బాట పట్టాయి. దీంతో కీలక సూచీలు నెల చివరి ట్రేడింగ్ సెషన్‌ను నష్టాల్లో ముగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 238 పాయింట్లు కోల్పోయి 63,875 వద్ద స్థిరపడింది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయి 19,093 వద్ద ముగిసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 208 పాయింట్లను కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 142 పాయింట్ల లాభంతో నేడు ప్రయాణాన్ని ముగించింది. ఈ క్రమంలో రియల్టీ మినహా అన్ని సెక్టార్ల సూచీలు నష్టాల్లో నెలాఖరు రోజున ప్రయాణాన్ని ముగించాయి.

ఎన్ఎస్ఈలో SBI లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్, టాటా కన్జూమర్, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, హిందాల్కొ, సిప్లా, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, యూపీఎల్, నెస్లే, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్యూఎల్, బజాజ్ ఆటో, ఎల్ టి, ఎస్బీఐ, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, ఎల్ టిఐఎమ్, ఓఎన్జీసీ, ఎయిర్ టెల్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హీరో మోటార్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ, దివీ ల్యాబ్స్, టీసీఎస్, కోల్ ఇండియా, ఎల్ టి, బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, మారుతీ, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications