Stock Market: ఐటీ కంపెనీల్లో కొత్త ఊపు..భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!
శుక్రవారం భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 1,000 పాయింట్లు ఎగబాకింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్ స్టాక్స్‌లో బలమైన కొనుగోళ్లు, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ త్రైమాసిక ఫలితాలు బాగా రావడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 964.58 పాయింట్లు పెరిగి 78,151.45 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 261.55 పాయింట్లు పెరిగి 24,334 వద్ద స్థిరపడింది. 1,632 షేర్లు పెరగ్గా 2,419 షేర్లు తగ్గాయి. టెక్ మహీంద్రా త్రైమాసిక ఫలితాలు అంచనాలు మించడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్‌లు బెంచ్‌మార్క్ సూచీలకు మద్దతుగా నిలిచాయి.
నిఫ్టీ ఐటీ సూచీ 1.75 శాతం పెరిగింది. నిఫ్టీలో అత్యధిక లాభాలు పొందిన వాటిలో టెక్ మహీంద్రా 4.14 శాతం, టీసీఎస్ 3.09 శాతం పెరిగాయి. ఈ రెండు ఐటీ దిగ్గజాలు సూచీలోని అగ్ర లాభపడిన వాటిలో చోటు దక్కించుకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, ముడి చమురు ధరలు అధికంగా ఉండటం వల్ల మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ రంగాలు ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు పెరిగాయి.

ఈ సెషన్‌లో రిలయన్స్ షేర్లు 2 శాతానికిపైగా పెరగ్గా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 2 శాతం వరకు లాభపడ్డాయి. సెషన్‌లో బ్యాంక్ నిఫ్టీ 1% పెరగ్గా.. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచీ 1.5 శాతం పెరిగింది. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ సూచీ మాత్రం 0.30 శాతం మేర క్షీణించింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ లో టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్, హిందిస్థాన్ యూనిలివర్, ఎంఅండ్ఎం, యాక్సెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్ సీఎల్ టెక్, ఎస్బీఐఎన్, ఎల్అండ్ టీ, పవర్ గ్రీడ్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్, బీఈఎల్, ఏసియన్ పెయింట్స్, ఐటీసీ, మారుతి, టాటా స్టీల్ట్, టైటాన్, ఎటర్నల్ లాభాల్లో ముగిశాయి. ఎన్టీపీసీ, ఇండిగో, అల్ట్రాటెక్ సిమెంట్, భారతి ఎయిర్ టెల్, ట్రెంట్, సన్ ఫార్మా నష్టోల్లో ముగిశాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications